Mon Dec 23 2024 14:40:31 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం..
మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. మహేష్ కు స్వయానా
కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. దీనివల్ల ప్రమాదం లేదని నిపుణులు చెప్తున్నప్పటికీ.. వ్యాప్తి మాత్రం డెల్టాను మించిపోతోంది. ఓ పక్క కరోనా.. మరోపక్క ఒమిక్రాన్ లతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. మహేష్ కు స్వయానా వదిన.. నమ్రతకు స్వయానా అక్క అయిన శిల్ప శిరోద్కర్ కరోనా బారిన పడింది.
గత నాలుగురోజులుగా ఆమె కరోనాతో పోరాడుతున్నట్లు శిల్పా స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండండి.. అందరూ టీకాలు వేయించుకోండి.. కోవిడ్ నియమాలను పాటించండి అంటూ శిల్ప శిరోద్కర్ విజ్ఞప్తి చేశారు. ఈ పోస్ట్ పై నమ్రతా స్పందించారు. కరోనా నుంచి నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ నమ్రతా కామెంట్ చేశారు. ఈమె కూడా ఒకప్పటి బాలీవుడ్ నటి. హమ్, ఖుదా గవా, ఆంఖేన్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది శిల్ప. వివాహం అనంతరం ఆమె దుబాయ్ లో నివసిస్తోంది.
Next Story