Mon Dec 23 2024 02:04:19 GMT+0000 (Coordinated Universal Time)
'ఖుషి', 'సఖి' మధ్య పోలిక అదే.. డైరెక్టర్ శివ నిర్వాణ!
ఖుషి ట్రైలర్ చూసిన ఆడియన్స్.. మణిరత్నం చిత్రాలు సఖి, దిల్ సే, ఒకే బంగారం షేడ్స్ కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ..
'లైగర్' తరువాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేస్తున్న సినిమా 'ఖుషి' (Kushi). కల్ట్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సమంత (Samantha) హీరోయిన్ గా నటిస్తుంది. శివ నిర్వాణ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇక ట్రైలర్ చూసిన ఆడియన్స్.. మణిరత్నం చిత్రాలు సఖి, దిల్ సే, ఒకే బంగారం షేడ్స్ కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో శివ నిర్వాణని గురించి ప్రశ్నించగా, దర్శకుడు బదులిస్తూ.. "ప్రేమ పెళ్లి అన్నప్పుడు 'పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం, ఫ్యామిలీకి దూరంగా ఉండడం, అలాగే పెళ్లి తరువాత కొన్ని గొడవలు'.. ఇలాంటి విషయాలు ప్రతి ప్రేమ కథలో జరుగుతాయి. అలా అని అన్ని లవ్ స్టోరీస్ ఒకటే అనలేము కదా..? ఆఫ్టర్ మ్యారేజ్ అనే పాయింట్ ని తీసుకోని ఒక మూవీ చేయాలని అని అనుకున్నాను. అయితే చాలా సినిమాలో ఈ పాయింట్ ని ఒక సాంగ్ లో చూపించేస్తారు. కానీ మణిరత్నం అలా చేయకుండా ఆ పాయింట్ నే తన సినిమా కథగా తీసుకున్నారు. ఇప్పుడు నేను అదే పని చేశాను. ఆ ఒక్కటే ఖుషి, సఖి మధ్య పోలిక. దీంతో మీకు సీన్స్ మధ్య కొంచెం పోలిక కనబడి ఉండవచ్చు. కానీ ఈ ప్రేమ కథ వేరు" అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 1న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మలయాళ సంగీతం దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. విజయ్ కి కూడా సక్సెస్ ని అందిస్తారు..? లేదా..? చూడాలి.
Next Story