Sun Dec 22 2024 02:51:24 GMT+0000 (Coordinated Universal Time)
Shivaratri Special Shows : హైదరాబాద్లో శివరాత్రికి స్పెషల్ సినిమా షోస్ ఇవే..
మహాశివరాత్రి సందర్భంగా.. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్స్ లో మూవీ లవర్స్ కోసం కొన్ని సినిమాలు ప్రత్యేక షోలో వేయబోతున్నారు
Shivaratri Special Shows : మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్స్ లో మూవీ లవర్స్ కోసం కొన్ని సినిమాలు ప్రత్యేక షోలో వేయబోతున్నారు. ఈ సినిమాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఆన్లైన్ లో ఓపెన్ అయ్యాయి.
మార్చి 8 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ స్పెషల్ షోలు ప్రారంభం కానున్నాయి. మరి ఆ స్పెషల్ షోల సినిమాల లిస్టు వైపు ఓ లుక్ వేసేయండి. వాటిలో మీ ఫేవరెట్ మూవీ ఉంటే.. బుక్ చేసుకొని శివరాత్రికి థియేటర్స్ లో జాగారం చేసేయండి. ఆ స్పెషల్ షోల మూవీ లిస్టు ఇవే..
వాల్తేరు వీరయ్య
వీరసింహారెడ్డి
కెమెరామెన్ గంగతో రాంబాబు
రెబల్
సలార్
అదుర్స్
దసరా
డీజే టిల్లు
మ్యాడ్
కార్తికేయ 2
హనుమాన్
బుక్ మై షో వంటి ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ఫార్మ్స్ లో ఈ స్పెషల్ షో బుకింగ్ ఓపెన్ అయ్యాయి. అర్ధరాత్రి 12 తరువాత ఒకటి లేదా రెండు షోలు మాత్రమే పడుతున్నాయి. మరి ఆ రోజుని సినిమాతో జాగారం చేయాలనుకుంటే.. ఇప్పుడు బుక్ చేసేసుకోండి.
Next Story