Fri Dec 20 2024 18:28:59 GMT+0000 (Coordinated Universal Time)
Shobha Shetty : ఎలిమినేట్ అయిన శోభాశెట్టి ఎంత సంపాదించింది..?
14వ వారాలు హౌస్ లో ఉన్న శోభాశెట్టి.. ఎలిమినేట్ అవుతూ ఎంత రెమ్యూనరేషన్ తీసుకోని వెళ్లారో తెలుసా..?
Shobha Shetty : తెలుగు బిగ్బాస్ సీజన్ 7 ఫైనల్ కి వచ్చేసింది. 14వ వారం కూడా పూర్తీ చేసుకొని చివరి వారంలోకి అడుగుపెట్టేసింది. ఇక ఈ వారం అందరూ అనుకున్నట్లు గానే శోభాశెట్టి ఎలిమినేటి అయ్యారు. 'కార్తీక దీపం' సీరియల్ లో మోనిత పాత్రతో విలనిజం చూపించి మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇక బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తరువాత.. మంచిగా ఆడుతూనే అప్పుడప్పుడు విలనిజం చూపిస్తూ గేమ్ ని రసవత్తరంగా మార్చారు.
ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న శివాజీతో ఫైట్ చేస్తూ గట్టి పోటీ ఇచ్చారనే చెప్పాలి. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి.. ఆల్మోస్ట్ ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటూనే వచ్చారు. అయినాసరి చివరి వారం వరకు కొనసాగుతూ వచ్చారంటే.. గ్రేట్ అనే చెప్పాలి. మరి 14 వారలు హౌస్ లో ఉన్న శోభా.. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత తీసుకు వెళ్లారో తెలుసా..?
'కార్తీక దీపం' ద్వారా శోభాశెట్టికి మంచి ఫేమ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె హౌస్ లోకి రెండున్నర లక్షల రూపాయల రెమ్యునరేషన్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారని సమాచారం. దీని బట్టి చుస్తే ఆమె 14 వారాలకు గాను దాదాపు 35 లక్షల పారితోషకం అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక హౌస్ నుంచి బయటకి వెళ్తూ ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోవడమే కాదు.. శివాజీని కూడా కొంత నెగటివ్ చేస్తూనే బయటకి వెళ్లారు.
తానే ఎలిమినేట్ అవబోతున్నట్లు కనిపెట్టిన శోభాశెట్టి.. వెళ్లేముందు శివాజీని బ్యాడ్ చేసే బయటకి వెళ్తాను అని చెప్పారు. అన్నట్లు గానే ఓ టాస్క్ శివాజీని ట్రిగ్గర్ చేశారు. ఇక శివాజీ కోపంతో ఊగిపోయి పీకమీద కాలేసి తొక్కుతా అంటూ మాట్లాడి నాగార్జున చేత, ఆడియన్స్ చేత విమర్శలు ఎదురుకున్నారు. కాగా శోభా ఎలిమినేషన్ తో ఇంక హౌస్లో.. శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, ప్రియాంక కంటెస్టెంట్స్ మిగిలారు. మరి వీరిలో ఎవరు టైటిల్ విన్ అవుతారో చూడాలి.
Next Story