Sat Dec 21 2024 06:57:26 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ విగ్రహం తీసేయాలి.. బాహుబలి నిర్మాత సీరియస్ ట్వీట్..
ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సీరియస్ అయ్యారు. ఆ విగ్రహాన్ని వెంటనే తొలిగించేలి అంటూ..
ప్రభాస్ (Prabhas) ‘బాహుబలి’ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ఇంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్‌ని.. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియం గుర్తించి తనకి అరుదైన గౌరవాన్ని అందించింది. ఆ మ్యూజియంలో బాహుబలి గెటప్ లో ఉన్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ట్రిబ్యూట్ ఇచ్చారు. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.
ఇక అక్కడ విగ్రహం పెట్టేముందు ప్రభాస్ ని, బాహుబలి టీంని సంప్రదించే చేశారు. అయితే తాజాగా ఎటువంటి అధికారిక అంగీకారం లేకుండా మరో కొత్త మైనపు విగ్రహం పుట్టుకొచ్చింది. ఇక ఈ విగ్రహం పై సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా రియాక్ట్ అవుతూ సీరియస్ అయ్యారు. ఇంతకీ ఆ కొత్త మైనపు విగ్రహం ఎక్కడ పెట్టారు..? దాని పై ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయి..? నిర్మాత సీరియస్ అయ్యేంత ఏముంది ఆ విగ్రహంలో..?
కర్ణాటకలోని బెంగళూరులో కూడా ఒక 'వాక్స్ మ్యూజియం' ఉంది. ఈ మ్యూజియంలోనే బాహుబలి గెటప్ లో ఉన్న ప్రభాస్ కొత్త మైనపు విగ్రహాన్ని (Wax Statue) ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహం బాహుబలి గెటప్ లో ఉన్నపటికీ.. అది చూడడానికి అసలు ప్రభాస్‌లా లేదు. దీంతో నెటిజెన్స్ అసలు ఆ విగ్రహం ఎవరిది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ప్రభాస్ అభిమానులు కూడా ఆ విగ్రహ ఏర్పాటు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ విషయం శోభు యార్లగడ్డ వరకు వెళ్లడంతో ఆయన రియాక్ట్ అవుతూ ఒక ట్వీట్ చేశారు. "ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకొని చేసిన వర్క్ కాదు. ఇది మా అనుమతి లేకుండా చేసిన పని. దీనిని వెంటనే తొలిగించేలా చర్యలు తీసుకుంటాము" అంటూ సీరియస్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ కొత్త ప్రభాస్ మైనపు విగ్రహాన్ని వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
Next Story