Mon Dec 23 2024 13:05:10 GMT+0000 (Coordinated Universal Time)
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ కుటుంబంలో ఇంతటి విషాదమా!!
విజయ్ ఆంటోనికి 2006 పెళ్లయింది. ఫాతిమా అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నాడు
నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కుమార్తె మీరా (16) మంగళవారం తెల్లవారుజామున ఆళ్వార్‌పేటలోని తమ నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 12వ తరగతి చదువుతున్న మీరా డిప్రెషన్ తో పోరాడుతూ ఉంది. ఇంతలో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. తెల్లవారుజామున 3 గంటలకు మీరా ఉరి వేసుకుని కనిపించడంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఆమె వయస్సు 16 సంవత్సరాలు. ఆమె చెన్నైలోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. ఆ బాలిక డిప్రెషన్‌తో పోరాడుతున్నట్లు తమిళ మీడియా సంస్థలు తెలిపాయి. ఆమె గదిలో ఉరి వేసుకుని కనిపించడంతో మీరాను చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విజయ్ ఆంటోనికి 2006 పెళ్లయింది. ఫాతిమా అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె లారా, కుమారుడు ఉన్నారు. తమిళ మీడియా ఛానల్స్ ప్రకారం, ఇంట్లోని వాళ్లు తెల్లవారుజామున 3 గంటలకు కుమార్తె గదిలోకి వెళ్లి చూసినప్పుడు.. ఆమె ఫ్యాన్ క్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో పనిచేసే వారి సాయంతో ఆమెను కిందకు దించి కారులో కావేరీ ఆస్పత్రికి తరలించారు. లారా మరణ వార్త విని సినీ ప్రముఖులు, లారా స్నేహితులు సంతాపాన్ని ప్రకటించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story