Mon Dec 23 2024 07:58:31 GMT+0000 (Coordinated Universal Time)
Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ బాయ్ ఫ్రెండ్ అతనేనా.. వీడియో వైరల్
ఇన్నాళ్లు రూమర్ గా ఉన్న శ్రద్దా కపూర్ ప్రేమ కథ.. ఇప్పుడు తెరపైకి వచ్చేసింది. వైరల్ అవుతున్న వీడియో..
Shraddha Kapoor : బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్.. 'సాహో' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే, గత కొంతకాలంగా ఈ భామ ప్రేమ వ్యవహారం గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ప్రముఖ బాలీవుడ్ రచయిత రాహుల్ మోడీతో శ్రద్దా ప్రేమలో ఉందని, కొన్నాళ్ల నుంచి ఇద్దరు డేటింగ్ చేస్తూ వస్తున్నారని బి-టౌన్ లో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.
అయితే శ్రద్దా అండ్ రాహుల్ మాత్రం.. ఎప్పుడూ ఎక్కడా కలిసి కనిపించలేదు. దీంతో ఆ వార్త ఇన్నాళ్లు ఒక రూమర్ గా ఉండిపోయింది. కానీ తాజాగా ఆ రూమర్ నిజం అనిపించేలా ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గా గుజరాత్ జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ కి బాలీవుడ్ స్టార్స్ అంతా తరలివచ్చారు.
ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లోనే శ్రద్దా అండ్ రాహుల్ కలిసి కనిపించారు. ఇద్దరు కలిసి అంబానీ జంట పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. ఆ ప్రేమ రూమర్స్ ని కన్ఫార్మ్ చేసేసుకుంటున్నారు. శ్రద్దా కపూర్ బాయ్ ఫ్రెండ్ అతనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట వీరి ప్రేమ కథని పెళ్లి వరకు తీసుకువెళ్తారేమో చూడాలి.
Next Story