50 లక్షలు డిమాండ్ చేసిన సీనియర్ హీరోయిన్
ఒకప్పుడు హీరోయిన్ శ్రియ టాలీవుడ్ లో స్టార్ హీరో దగ్గర నుండి యంగ్ హీరోస్ దాకా అందరితో నటించి గ్లామర్ పరంగా మంచి పేరు అండ్ ఇమేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ అమ్మడు తన ప్రియుడుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో అంత ఈమె ఇంకా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె సినిమాల్లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
లేటెస్ట్ గా ఈమె అందరిని షాక్ కి గురి చేస్తూ ఓ సినిమాను ఒప్పుకుంది. ఈమెకు మంచి క్రేజ్ ఉండటంతో ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది. సినిమాటోగ్రాఫర్ సుజన డైరెక్షన్ లో సినిమాను ఒకే చేసింది శ్రియ. ఆల్రెడీ ఆమెతో చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో ఒకే చెప్పినట్టు తెలుస్తుంది.
అయితే శ్రియ ఈ సినిమా కోసం ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేసిందట. ఒకేసారి ఇంత అడగటం.. ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే మరి ఈ అమ్మడు అడిగినంత మేకర్స్ ఇస్తారో లేదో చూడాలి. పెళ్లికి ముందు కన్నా పెళ్లి తర్వాత ఇంతలా డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.