అప్పుడే పిల్లలా..మరి కెరీర్..?
గత పదేళ్లుగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రియ శరణ్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ఎప్పుడూ గ్లామర్ షో చేసే శ్రియ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటుంది అని అనుకున్నారు అంతా. కానీ శ్రియాకు కేవలం పెళ్లి మాత్రమే అయ్యింది. కానీ సినిమాలు మాత్రం వదలనంటుంది. స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అందరితో కలిసి నటించిన శ్రియ శరణ్ కి ఇప్పుడు అవకాశాలు పెద్దగా రావడం లేదు. గత ఏడాది శ్రియ.. బాలకృష్ణ సరసన బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసింది. లేట్ వయసులో పెళ్లి చేసుకున్న శృయ శరణ్ ఇంకా కెరీర్ అంటూ సినిమాల మీదే ఫోకస్ పెట్టింది.
అప్పుడే పిల్లలా..?
పెళ్ళైన తర్వాత శ్రియ మొదటిసారిగా నిహారిక కొణిదెల తో కలిసి లేడి మల్టీస్టారర్ సినిమా లో నటిస్తుంది. లేట్ వయసులోనూ ఘాటైన అందాలను ఆరబోస్తూ ఇంకా దర్శక నిర్మాతల దృష్టిలో పడడానికి తెగ ట్రై చేస్తుంది. మరి పెళ్లి వయసు దాటిపోయిన చాన్నాళ్లకు పెళ్లి చేసుకున్న శ్రియ కొన్నాళ్ళు హనీమూన్ అంటూ ఎంజాయ్ చేసేసి.. తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికీ సీనియర్ హీరోస్ పక్కన అవకాశాలు అందిపుచ్చుకుంటున్న శ్రియకి అప్పుడే పిల్లలని కనాలని లేదంటుంది. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు కదా .. అంటూనే... ఇప్పుడప్పుడే పిల్లల ఆలోచన కూడా లేదని కుండబద్దలు కొట్టింది.
శ్రియపై సెటైర్లు...
ఇప్పుడే పిల్లలేమిటండి... ఇంకా ఓ ఇరవై సినిమాలు చేయాలని ఉంది అంటూ అందరినీ షాక్ కి గురి చేసింది. మరి ఇప్పటికే వయస్సు దాటాక పెళ్లి చేసుకుంది అంటుంటే.. ఇప్పుడు పిల్లలని ఏ వయసులో కంటుందో అనే సెటైర్స్ పడుతున్నాయి. అయినా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలనేది.. హీరోయిన్స్ కి కుదరదులెండి. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం పెళ్లి, పిల్లల తర్వాత కూడా సినిమాల్లో బిజీ అవుతున్నారు.