Sun Dec 22 2024 15:17:43 GMT+0000 (Coordinated Universal Time)
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శృతిహాసన్ దూరం..
ప్రమోషన్స్ లో భాగంగా.. నేడు విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందిన సినిమా వాల్తేరు వీరయ్య. జనవరి 13న విడుదలకు రెడీ అవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా.. నేడు విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం.. రవితేజ, చిరంజీవి, బాబీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత ప్రైవేట్ జెట్ లో విశాఖకు చేరుకున్నారు. కాగా.. వాల్తేరు వీరయ్యలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోతున్నట్లు చెప్పి.. అభిమానులకు షాకిచ్చింది.
ఆరోగ్యం బాలేకపోవడంతో.. ఈ ఈవెంట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని శృతి హాసన్ తెలిపింది. ఈవెంట్ ను చాలా మిస్ అవుతున్నానని విచారం వ్యక్తం చేసింది. శృతి హాసన్ అటు బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఒంగోలులో జరగ్గా, ఈ కార్యక్రమానికి శృతి హాజరైంది. కాగా.. వాల్తేరు వీరయ్య ఈవెంట్ కోసం ఏయూ గ్రౌండ్స్ కి అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
Next Story