Tue Nov 05 2024 05:42:48 GMT+0000 (Coordinated Universal Time)
తన పర్సనల్ లైఫ్ గురించి ఏ మాత్రం దాచుకోకుండా చెప్పేసిన శ్రుతి హాసన్
నటి శ్రుతి హాసన్ ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది
నటి శ్రుతి హాసన్ ఎట్టకేలకు తన ప్రస్తుత వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. తాను ఒంటరిగా ఉన్నానని ప్రకటించింది. శాంతాను హజారికాతో ఆమె ఇటీవల విడిపోయింది. దీనిపై ఆమె అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఆమె ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని ఒప్పుకుంది. శృతి హాసన్ తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చర్చించింది. పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
నాలుగేళ్లకు పైగా సహజీవనం చేసిన ఆమె శాంతాను హజారికాతో ఈ ఏడాది మార్చిలో తన సంబంధాన్ని ముగించుకుంది. ఈ విషయమై ఆమెను పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. “నేను ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడం ఆనందించను, కానీ నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను, ప్రస్తుతానికి ఎవరితోనూ ఇష్టపడను. పని చేయడం.. నా జీవితాన్ని ఆనందించడం మాత్రమే చేస్తున్నాను ”అని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఇక ఎప్పుడూ వ్యక్తిగతంగా షాపింగ్ చేయడానికి ఇష్టపడతాను.. కానీ నేను ఆన్లైన్ షాపింగ్‌ను కూడా ఆస్వాదిస్తున్నానని తెలిపింది. శ్రుతి హాసన్ తదుపరి చిత్రం తెలుగు, హిందీలో రూపొందుతున్న “డకోయిట్”. ఈ సినిమాలో అడివి శేష్ సరసన ఆమె నటిస్తోంది.
Next Story