Mon Dec 23 2024 01:57:50 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ అలా చేస్తాడని ఎవరూ అనుకోరు.. శృతిహాసన్ కామెంట్స్..
పవన్ కళ్యాణ్ అలవాట్లు గురించి శృతిహాసన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె ఏమందంటే..?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ శృతిహాసన్ కలిసి మూడు సినిమాల్లో నటించారు. నిజానికి పవన్ హీరోయిన్స్ లో ఎక్కువ సినిమాలు చేసింది శృతిహాసన్తోనే. గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్.. ఇలా పవన్ తో మూడు సినిమాల్లో ట్రావెల్ చేసిన శృతికి పవన్ అలవాట్లు పై ఓ అవగాహన ఉంది. ఇక ఈ అవగాహనతోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పవన్ అలవాట్లు గురించి మాట్లాడారు.
రీసెంట్ గా శృతిహాసన్.. సాయి ధరమ్ తేజ్, దర్శకుడు తరుణ్ భాస్కర్, శ్రియారెడ్డి, నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ గారికి బొమ్మలతో (లెగోస్) ఆడుకునే అలవాటు ఉందని ఎవరూ అనుకోరు. ఆయన అలా చేస్తారని ఎవరూ ఊహించారు కూడా" అంటూ వ్యాఖ్యానించారు.
ఇక ఈ మాటలకు సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అవుతూ.. "మా చిన్నతనంలో ఆయన కూడా మాతో కలిసి ఆడుకునేవారు. నిజానికి లెగోస్ ఆడుకుందాం అని ఆయనే పిలిచేవారు. నేను ఎప్పుడైన లెగోస్ కొనుకున్నప్పుడు.. ఆయనకు కూడా ఓ సెట్ తీసుకునేవాడిని. మా అమ్మ సైతం ఆయన పుట్టినరోజుకి ఆ లెగోస్ కొనుకోమనే ఆయనకి డబ్బులు ఇచ్చేది" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా పవన్ టీనేజ్ లో రామ్ చరణ్ తో పాటు ఇంటిలో పిల్లలందరికీ కేర్ టేకర్ గా ఉండేవారు. ఆ సమయంలోనే పిల్లలతో కలిసి ఆడుకునేవారు. లెగోస్ చాలా ఆసక్తిగా ఉండేవని అందుకే అవి ఆడేవాడిని అని పవన్ చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు. చిరంజీవి కూడా పవన్ ఈ లెగోస్ ఆడతాడని చెప్పుకొచ్చారు.
Next Story