Mon Dec 23 2024 07:14:14 GMT+0000 (Coordinated Universal Time)
మూవీ షూటింగ్ అని చెప్పి.. పెళ్లి చేసేసుకున్న సిద్ధార్థ్, అతిథి..
మూవీ షూటింగ్ అని చెప్పి అత్యంత రహస్యంగా పెళ్లి చేసేసుకున్న సిద్ధార్థ్, అతిథి.
Siddharth - Aditi Rao Hydari : సినిమా యాక్టర్స్ సిద్దార్థ్, అదితిరావు హైదరి గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో వచ్చిన ‘మహాసముద్రం’ మూవీలో నటించిన వీరిద్దరూ.. ఆ టైంలోనే ప్రేమలో పడ్డారు. ఇక అప్పటినుంచి పార్టీలకు, డిన్నర్స్ అండ్ లంచ్స్ అంటూ రెస్టారెంట్స్ కి కలిసి వెళ్తూ కనిపిస్తున్నారు. కానీ ప్రేమ, పెళ్లి విషయం పై మాత్రం ఎక్కడా కామెంట్స్ చేయడం లేదు.
అయితే తాజాగా ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకొని ఏడడుగులు వేసేసినట్లు సమాచారం. తెలంగాణ వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక ఆలయంలో మార్చి 27న సిద్ధార్థ్, అతిథి రహస్యంగా పెళ్లి చేసేసుకున్నట్లు తెలుస్తుంది. ఆలయంలో పని చేసే స్థానిక పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పి, వారిని లోపలికి రానివ్వకుండా.. తమిళనాడుకి చెందిన పూజారులతో అత్యంత రహస్యంగా సిద్ధార్థ్, అతిథి మేడలో మూడు ముళ్ళు వేసేశారట.
కాగా అతిథి రావు హైదరి వనపర్తి రాజ సంస్థానానికి చెందిన వారసురాలు. ఆమె తల్లి 'విద్యారావు'.. వనపర్తి చివరి రాజు 'జే రామేశ్వర రావు' కుమార్తె. అందుకనే ఈ పెళ్లిని వనపర్తి శ్రీరంగపురం ఆలయంలో జరిపించారు. ఇక ఈ పెళ్ళికి వనపర్తి చివరి రాజు వారసుడైన 'జే కృష్ణదేవర రావు' ఫ్యామిలీ హాజరయ్యినట్లు సమాచారం. మరి ఇంత రహస్యంగా చేసుకున్న ఈ పెళ్లిని ఎప్పుడు అధికారికంగా అనౌన్స్ చేస్తారో చూడాలి.
Next Story