Mon Dec 23 2024 10:41:03 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి చేసుకోబోతున్న శింబు - నిధి అగర్వాల్.. నిజమేనా ?
2022లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వినపడుతున్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు త్వరలోనే పెళ్లితో ఒక్కటికానున్నారన్న పుకార్లు.. కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఇప్పుడు వారి బంధాన్ని పెళ్లితో అధికారికం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే శింబు తమ వివాహ తేదీని ప్రకటించవచ్చని తెలుస్తోంది. కానీ.. ఈ పుకార్లపై అటు శింబు గానీ, ఇటు నిధి గానీ స్పందించకపోవడంతో వీరి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ లేదు.
నిధి సన్నిహితులు మాత్రం ఈ పుకార్లను ఖండిస్తున్నారు. శింబు, నిధి 'ఈశ్వరన్'లో స్క్రీన్ స్పేస్ను పంచుకున్నారు. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని చూసి ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారంటూ వాపోతున్నారు. కానీ.. 2022లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వినపడుతున్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో శింబు ఒకరు. శింబు పెళ్లికి సంబంధించి నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తాజాగా శింబు - నిధి అగర్వాల్ ల పెళ్లి విషయం తెరపైకి రావడంతో.. శింబు అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ విషయంపై ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప.. పుకార్లపై క్లారిటీ రాదు.
Next Story