Mon Dec 23 2024 05:46:07 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ సింగర్ కు కరోనా.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ పోస్ట్ !
తాజాగా మరో ప్రముఖ సింగర్ కరోనా బారిన పడ్డారు. సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని
కొద్దిరోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. బడా హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ.. సింగర్లు, కొరియోగ్రాఫర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు సైతం కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా మరో ప్రముఖ సింగర్ కరోనా బారిన పడ్డారు. సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా నిర్థారణ అయిందని, లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని ఆమె తెలిపారు.
రెండు రోజుల క్రితం జ్వరంగా మొదలై.. ఇప్పుడు భరించలేని గొంతునొప్పి కూడా ఉందని, నిన్నటి నుంచే మెడిసిన్ తీసుకుంటున్నానని తెలిపారు. కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె నెటిజన్లకు సూచించారు. తాను కరోనా నుంచి త్వరగా కోలుకుని, తిరిగి మామూలు జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.
Next Story