Mon Dec 23 2024 14:57:08 GMT+0000 (Coordinated Universal Time)
రాడిసన్ ఘటనపై స్పందించిన రాహుల్.. ఏ పరీక్షకైనా సిద్ధం !
పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో కొంతమందికి నోటీసులు ఇచ్చి రాత్రే పంపించగా.. మరికొంతమందిని విచారణ చేసి..
హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పై నిన్న అర్థరాత్రి తర్వాత పోలీసులు దాడులు చేసి.. 150 మందికి పైగా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో సెలబ్రిటీలతో పాటు.. బడా నేతలు, ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహిస్తున్న ఫుడింగ్ మింగ్ పబ్‌పై రైడ్ చేశారు. అక్కడ డ్రగ్స్ కూడా లభ్యమవ్వడంతో.. కేసును మరింత సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు.
కాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో కొంతమందికి నోటీసులు ఇచ్చి రాత్రే పంపించగా.. మరికొంతమందిని విచారణ చేసి ఉదయం పంపించారు. వారిలో రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనపై వస్తోన్న ఆరోపణలపై స్పందించాడు. " నిన్న పార్టీలో నేను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. కావాలంటే నేను ఏ పరీక్షకైనా సిద్దమే, చెక్ చేసుకోండి. అసలు అది డ్రగ్స్ పార్టీ అని తెలియదు. తెలిస్తే వెళ్ళేవాడిని కాదు. ఫ్రెండ్ బర్త్ డే కావడంతో సన్నిహితులతో కలిసి పబ్ కి వెళ్ళాను. నేను గతంలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. నేను ఏ తప్పు చేయకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారు." అని తెలిపారు.
Next Story