Mon Dec 23 2024 08:18:18 GMT+0000 (Coordinated Universal Time)
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ రేవంత్ భార్య
ఇక రేవంత్ హౌస్ లో ఉండగా.. అన్విత సీమంతం జరిగింది. రేవంత్ కోసం బిగ్ బాస్ అన్విత సీమంతం ఫొటోలను..
బిగ్ బాస్ సీజన్ 6 లో.. లాస్ట్ కంటెస్టంట్ గా అడుగుపెట్టి.. ప్రస్తుతం టాప్ కంటెస్టంట్ గా ఉన్న సింగర్ రేవంత్ టైటిల్ గెలుస్తాడో లేదో తెలియకముందే.. అతని ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్ హౌస్ లోకి వెళ్లేటప్పటికే అతని భార్య అన్విత గర్భిణి. టైటిల్ కొట్టి బయటికి వచ్చి ఆ కప్ ను తన కూతురికి ఇస్తానని అప్పుడే చెప్పాడు రేవంత్. తాజాగా అన్విత.. తాను పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన రేవంత్-అన్వితల వివాహం సాంప్రదాయబద్దంగా జరిగింది. ఇక రేవంత్ హౌస్ లో ఉండగా.. అన్విత సీమంతం జరిగింది. రేవంత్ కోసం బిగ్ బాస్ అన్విత సీమంతం ఫొటోలను చూపగా.. వాటిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఫ్యామిలీ మీట్ లో ఆదిరెడ్డి కూతుర్ని చూసి మరింత ఎమోషనల్ అయ్యాడు. తనకు నాన్న లేని లోటు తెలుసని, అందుకే తానెప్పుడు నాన్నను అవుతానా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. డిసెంబర్ 1న అన్విత పాపకు జన్మనివ్వగా.. నెటిజన్లు, సెలబ్రిటీలు రేవాన్వితలకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇటీవలే అన్విత పలు యూట్యూబ్ ఛానల్స్ కి వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి, రేవంత్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
Next Story