Mon Dec 23 2024 11:46:11 GMT+0000 (Coordinated Universal Time)
సిద్ పాడితే చాలు.. ఆ పాట హిట్టే.. ఒక పాటకు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
కెరీర్ మొదట్లో పాటకు రూ.4 లక్షలు ఛార్జ్ చేసిన సిద్.. ఇప్పుడు తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశాడట.
సిద్ శ్రీరామ్. ఇప్పుడు శ్రోతలకు పరిచయం అక్కర్లేని పేరు. అతను పాట పాడాడంటే.. అది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. సిద్ శ్రీరామ్ పాట పాడితే చాలు.. అనుకునే నిర్మతలూ ఉన్నారు. పాట చిన్నదా, పెద్దదా.. సినిమా చిన్నదా.. పెద్దదా అని చూడకుండా పాట పాడుతాడు సిద్. అందుకే అతను పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సిద్ పాట అంటే.. లక్షల వ్యూస్ తో దూసుకెళ్లాల్సిందే. ఆ స్వరంలోని మాధుర్యం.. అంత మెలోడియస్ గా పాడటమే సిద్ స్పెషాలిటీ. మరి ఇంత స్పెషల్ గా పాడుతున్న సిద్.. ఒక పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా ?
కెరీర్ మొదట్లో పాటకు రూ.4 లక్షలు ఛార్జ్ చేసిన సిద్.. ఇప్పుడు తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశాడట. సినిమా చిన్నదైతే కాస్త తగ్గుతున్నాడేమో కానీ.. పెద్ద సినిమాలకు మాత్రం తగ్గేదే లే అన్నట్లే ఉన్నాడట. సాధారణంగా ఒక పాటకు తీసుకునే రెమ్యునరేషన్ రూ.8 లక్షలలోపు ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ పాటకు రూ.6 లక్షలు తీసుకున్న సిద్.. ఇప్పుడు రూ.7 లక్షలకు పెంచేశాడని టాక్. మరీ పెద్ద సినిమాలైతే రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ.. సిద్ పాటకున్న క్రేజే వేరు కాబట్టి.. ఎన్ని లక్షలిచ్చైనా తమ సినిమాలో పాట పాడించుకునేందుకు రెడీ అవుతున్నారట నిర్మాతలు. ఇదివరకూ ఏ పాటనైనా పాడే సిద్.. ఇప్పుడు చాలా సెలక్టివ్ గా పాడుతున్నాడు. ఇటీవల బంగార్రాజులో "నాకోసం మారావా నువ్వు".. అతిథిదేవో భవలో "బాగుంటుంది నువ్వు నవ్వితే" పాటలు సిద్ పాడినవే. ఆ పాటలు ఇలా విడుదలయ్యాయో లేదో.. అలా హిట్ అయ్యాయి మరి.
Next Story