సునీత పెళ్లి వెన్యూ ఫిక్స్!
సింగర్ సునీత రెండో పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. జనవరి 9 న యూట్యూబ్ ఛానల్ ఓనర్ మ్యాంగో రామ్ ని రెండో [more]
సింగర్ సునీత రెండో పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. జనవరి 9 న యూట్యూబ్ ఛానల్ ఓనర్ మ్యాంగో రామ్ ని రెండో [more]
సింగర్ సునీత రెండో పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. జనవరి 9 న యూట్యూబ్ ఛానల్ ఓనర్ మ్యాంగో రామ్ ని రెండో వివాహం చేసుకోబోతున్న సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీల హడావిడి ఇంకా ముగియలేదు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోని సునీత సన్నిహితులకు, అలాగే కొంతమంది సింగర్స్ కి సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది. మ్యాంగో రామ్ కూడా తన సన్నిహితులకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఇంకా సునీత రెండు మూడు వెడ్డింగ్ పార్టీలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. జనవరి 3, 6 తేదీల్లో సునీత రిలేటివ్స్, రామ్ రిలేటివ్స్ కి అదిరిపోయే పార్టీలు ఆరెంజ్ చేసినట్టుగా టాక్. అయితే సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఎంత గ్రాండ్ గా ఆర్భాటంగా జరిగాయో, జరుగుతున్నాయో.. అంత ఆర్భాటంగా సునీత పెళ్లి జరగడం లేదు.
హైదరాబాద్ లోని ఓ గుడిలో సునీత – రామ్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని.. 25 నుండి 30 మంది కుటుంబ సభ్యుల మధ్యన సునీత పెళ్లి జరగబోతున్నట్లుగా సమాచారం. రామ్ కుటుంబ సభ్యులు, సునీత కుటుంబ సభ్యులు, సునీత స్నేహితుల మధ్యనే సునీత పెళ్లి చాలా అంటే చాలా సింపుల్ గా గుడిలో జరగబోతున్నట్టుగా అత్యంత సన్నిహితుల ద్వారా అందిన సమాచారం. ఇక ఈ పెళ్లి కోసం సునీత బట్టల షాపింగ్ అలాగే నగల షాపింగ్ ఓ రేంజ్ లో జరిగింది అని, తన పెళ్లి కోసం సునీత ఎనిమిది రకాల బంగారు ఆభరణాల సెట్స్ ని కొనినట్లుగా సమాచారం. మరి ప్రస్తుతం సునీత పెళ్లి షాపింగ్ ముగిసినా పార్టీల హడావిడి మాత్రం ఇంకా ముగియలేదట.