Mon Dec 23 2024 15:10:50 GMT+0000 (Coordinated Universal Time)
రేపే "సార్" ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక ఇదే !
కాలేజ్ - స్టూడెంట్స్ కాన్సెప్ట్ తో.. విద్యావ్యవస్థ ఎలా బిజినెస్ గా మారిపోయిందన్న అంశాలను ..
ధనుష్ హీరోగా తెరకెక్కిన "సార్" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. కాలేజ్ - స్టూడెంట్స్ కాన్సెప్ట్ తో.. విద్యావ్యవస్థ ఎలా బిజినెస్ గా మారిపోయిందన్న అంశాలను ఈ సినిమాలో చూపించినట్లు ఇప్పటికే డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమాలో హీరో ధనుశ్ లెక్చరర్ గా కనిపించనుండగా.. మీనాక్షి పాత్రలో సంయుక్త మీనన్ ధనుశ్ సరసన నటించింది.
ఇప్పటికే సినిమా నుండి విడుదలైన "మాస్టారు మాస్టారు" పాట ఊహించని రీతిలో వైరల్ అయింది. కాగా.. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ వేదిక ఖరారైంది. ఫిబ్రవరి 15న అంటే రేపు సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మేకర్స్ టీమ్ అధికారిక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Next Story