Mon Dec 23 2024 06:51:50 GMT+0000 (Coordinated Universal Time)
అమెజాన్ ప్రైమ్ లోకి సీతారామం.. ఎప్పట్నుంచీ స్ట్రీమింగ్ అంటే
రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్వప్నా సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై సి. అశ్వనీదత్..
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమా.. ఘన విజయాన్ని అందుకుంది. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా నెలరోజుల థియేట్రికల్ రన్ లో రూ.80 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ఆకట్టుకుంది. మంచి కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించింది. ఓవర్సీస్ లోనూ సీతారామం ఆకట్టుకుంది. ఇప్పటికీ సీతారామం థియేటర్లలో సందడి చేస్తుండటం విశేషం.
రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్వప్నా సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై సి. అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తాజాగా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది అమెజాన్. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సీతారామం సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ లో సినిమా అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది.
Next Story