ఆ క్షణం నాన్నని హత్తుకుని ఏడ్చేశా : సితార
తాజాగా ఆ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో నమ్రత, సితార పాల్గొన్నారు. ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ..
సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రత ల కుమార్త సితార ఘట్టమనేని గురించి తెలియని నెటిజన్లుండరు. సోషల్ మీడియాలో ఆమెకు ఉండే మామూలు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. డ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ టూర్స్, ఇతర విషయాలను కూడా నెటిజన్లతో పంచుకుంటూ 13 లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇటీవలే సితార ఓ జువెల్లరీ యాడ్ లో నటించగా.. ఆ యాడ్ ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్ పై ప్రదర్శింపబడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో నమ్రత, సితార పాల్గొన్నారు. ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ.. నటించడం అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. జువెల్లరీ సంస్థ యాడ్ లో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని, షూట్ అంతా చాలా సరదాగా సాగిందని చెప్పుకొచ్చింది. యాడ్ కు సంబంధించిన ఫొటోలు టైమ్ స్క్వేర్ పై ప్రదర్శించిన రోజున.. ఆనందంతో కన్నీళ్లొచ్చాయని, నాన్నను హత్తుకుని భావోద్వేగంతో ఏడ్చేశానని తెలిపింది.