Mon Dec 23 2024 04:10:12 GMT+0000 (Coordinated Universal Time)
ప్లీజ్ సీత.. ఇలాంటి పనులు చేయకు.. మేం చూడలేం : మృణాల్ కు అభిమానుల విజ్ఞప్తి
అంతకుముందు బాలీవుడ్ లో పలు సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఒక్క సీతారామంతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చింది.
సీతారామంతో తెలుగు తెరకు పరిచయమై.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీత అంటే ఇలా ఉంటుందనేంతలా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. గతేడాది ఆగస్టు 5న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సీతారామం.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అంతకుముందు బాలీవుడ్ లో పలు సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఒక్క సీతారామంతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మళయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా.. దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో ఒదిగిపోయాడు.
సీత పాత్రలో ఇమిడిపోయిన మృణాల్.. చీరకట్టుతో, భాషతో అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించింది. చాలా మంది అబ్బాయిలకు సీత డ్రీమ్ గాళ్ అయింది. సీతారామం ముగిసిపోయి.. ఇప్పుడు వేరే సినిమాలు చేస్తున్నా సరే.. ఇంకా మృణాల్ ను సీత లాగే చూస్తున్నారు అభిమానులు. కొన్ని రోజుల క్రితమే కొన్ని మోడ్రన్ డ్రెస్ లలో మృణాల్ కనిపించడంతో మా సీత ఏంటి ఇలా మారిపోయింది, నువ్వు కూడా అందరి హీరోయిన్స్ లాగా చెయ్యకు, నువ్వు సీత గానే బాగుంటావు అని కామెంట్స్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా బికినీ ఫొటోలు పెట్టేసింది మృణాల్.
ఇక ఆ ఫోటోలను చూసి అభిమానుల గుండెలు గుభేల్ అన్నాయంటే నమ్మండి. ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్లిన మృణాల్.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. సీతా ఇలా మారిపోయావేంటి, నిన్ను బికినిలో చూడలేము, నువ్వు చీరలోనే బాగుంటావు, మీకేమైంది?, ఇది మా సీత కాదు, ఒక్క నిన్ను మాత్రం బికినిలో చూడకూడదు అనుకున్నాం కానీ నువ్వు దాన్ని బ్రేక్ చేశావు, నిన్ను ఇలా చూడలేకపోతున్నాము.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది మాత్రం బికినీలో కూడా బాగున్నావు అని కామెంట్ చేస్తున్నారు. సీత అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, మృణాల్ రియల్ లైఫ్.. రీల్ కి రియల్ కి చాలా తేడా ఉంటుంది. ఇది పూర్తిగా ఆమె ఇష్టమని కామెంట్ చేస్తున్నారు.
Next Story