Mon Dec 23 2024 13:39:23 GMT+0000 (Coordinated Universal Time)
11 ఏళ్లకే టైమ్స్ స్క్వేర్ పై మెరిసిన సితార
ఇంత చిన్న వయసులోనే ఆమెకు సోషల్ మీడియాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా మహేష్ వల్లే అనుకుంటే పొరపాటే. ఎంత స్టార్..
స్టార్ హీరోల పిల్లలకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ.. వాళ్లు కూడా తమకు ఉన్న టాలెంట్ తో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి వారిలో మన సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార కూడా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార.. సాంగ్స్, డ్యాన్స్, స్టడీస్, గేమ్స్, ట్రిప్స్ ఇలా ప్రతి విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. సితార టాలెంట్ చూసి మహేష్- నమ్రత లు కూడా సంబరపడిపోతుంటారు. ప్రతి విషయంలో యాక్టివ్ గా ఉండే సితార వయసు కేవలం 11 సంవత్సరాలే.
ఇంత చిన్న వయసులోనే ఆమెకు సోషల్ మీడియాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా మహేష్ వల్లే అనుకుంటే పొరపాటే. ఎంత స్టార్ హీరో కూతురైనా.. మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం కష్టం. సితార షేర్ చేసే విషయాలు, తన డ్యాన్స్ కే ఎక్కువమంది అభిమానులున్నారు. తాజాగా సితార తొలి కమర్షియల్ యాడ్ లో మెరిసింది. పీఎంజే జూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సీతూ పాప.. తొలి కమర్షియల్ యాడ్ ను సితార కలెక్షన్స్ పేరుతో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ పై ఆవిష్కరించారు. ఈ విషయాన్ని మహేష్ సోషల్ మీడియా టీమ్ అధికారికంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో 11 సంవత్సరాలు పూర్తిచేసుకోనున్న సితార.. ఇంత చిన్న వయసులోనే టైమ్స్ స్క్వేర్ పై "ప్రిన్సెస్ సితార"గా మెరవడం అంటే మామూలు విషయం కాదు కదా.
Next Story