Sat Nov 23 2024 00:01:22 GMT+0000 (Coordinated Universal Time)
Sivaji : పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై శివాజీ కామెంట్స్.. గెలిచిన ఆనందంలో..
పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై శివాజీ కామెంట్స్. చిన్న వయసులో అందరి పై గెలిచిన ఆనందంలో..
Sivaji : తెలుగు బిగ్‌బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్.. అరెస్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. బిగ్‌బాస్ ఫైనల్ రోజున కొంతమంది పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇతర బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్ దీప్, అశ్విని శ్రీ, గీతూ రాయల్ పై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్థులను కూడా ధ్వంసం చేయడం వంటి చర్యలు పై పోలీసులు సీరియస్ అయ్యి.. పల్లవి ప్రశాంత్, అతడి తమ్ముడిని A1 A2 చేర్చి పలు సెక్షన్ల కింద కేసుని నమోదు చేశారు.
వీరిద్దరితో పాటు దాడిలో పాల్గొన్న అభిమానులను కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, సోదరుడు రాజుని అరెస్ట్ చేయగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో హైదరాబాద్ చంచల్‌గూడ సెంట్రల్ జైలుకి తరలించారు. కాగా నిన్న పల్లవి ప్రశాంత్ న్యాయవాది బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. వాదనలు విన్న కోర్టు పల్లవి ప్రశాంత్‌కు, సోదరుడు రాజుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కాగా ఈ అరెస్ట్ పై బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివాజీ రియాక్ట్ అయ్యారు. హౌస్ లో ఉన్నంత కాలం శివాజీ, ప్రస్నాథ్ గురు శిష్యులుగా కలిసిమెలిసి ఉన్నారు. అయితే ప్రశాంత్ అరెస్ట్ అయిన తరువాత శివాజీ రియాక్ట్ అవ్వలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు.
శివాజీ కామెంట్స్.. "ప్రశాంత్ విషయంలో నన్ను చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వాడితో నాకున్న బంధం గురించి నేను ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళ ఫ్యామిలీతో టచ్ లోనే ఉన్నాను. ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నాను. చట్టాన్ని అతిక్రమించాడని వాడి మీద ఆరోపణ వేశారు. కానీ వాడు చట్టాన్ని గౌరవించే వ్యక్తి. ఏదో చిన్న వయసులో గెలిచిన ఆనందంలో వాడికే తెలియకుండా ఒక తప్పు జరిగింది. అది కోర్టులోని న్యాయమూర్తి కూడా గమనించి.. వాడి తప్పు లేదని త్వరలోనే తీర్పుని ఇస్తారు. చట్టపరంగానే వాడు బయటకి వస్తాడు. వాడేమి క్రిమినల్ కాదు, వాడు ఏ తప్పు చేయలేదు, త్వరలోనే నిర్దోషిగా బయటకి వస్తాడు" అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story