Fri Dec 20 2024 07:05:44 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 7 : బిగ్బాస్ హౌస్లోకి శివాజీ కొడుకు ఎంట్రీ..
బిగ్బాస్ హౌస్లోకి శివాజీ కొడుకు సర్ప్రైజ్ ఎంట్రీ. డాక్టర్ గా లోపలి వచ్చి..
Bigg Boss 7 : తెలుగు బిగ్బాస్ సీజన్ 7 సర్ప్రైజ్లతో చాలా ఇంటరెస్టింగ్ గా జరుగుతుంది. తొమ్మిది వారలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ ప్రస్తుతం 10వ వారం జరుపుకుంటుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ 7.. గత వారం ఎలిమినేషన్ తో 11 మందికి చేరింది. ప్రస్తుతం హౌస్ లో శివాజీ, ప్రశాంత్, గౌతమ్, అశ్విని, అర్జున్ అంబటి, యావర్, బోలే షవాలి, అమర్ దీప్, రతికారోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఉన్నారు.
టాలీవుడ్ నటుడు శివాజీ ప్రస్తుతం హౌస్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. టైటిల్ కూడా ఆయనే అందుకుంటాడు అంటూ ఆడియన్స్ జోష్యం చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే, ఇటీవల హౌస్ లో గాయపడి చెయ్యి నొప్పితో బాధ పడుతున్న శివాజీ.. తాను ఉండలేకపోతున్నాను ఇంటికి పంపించేయండి అంటూ సింపతీ గేమ్ ఆడుతున్నాడు. కాగా శివాజీ ఆరోగ్య పరిస్థితి చూడడానికి బిగ్బాస్ డాక్టర్ ని పంపిస్తూ రెగ్యులర్ చెకప్ చేస్తున్నాడు.
తాజాగా డాక్టర్ వేషంలో శివాజీ పెద్ద కొడుకుని హౌస్ లోకి తీసుకు వచ్చారు. డాక్టర్ వేషంలో లోపలి వచ్చిన శివాజీ పెద్ద కొడుకు.. డాక్టర్ గా చెకప్ లు చేసి చివరిలో నాన్న అంటూ పిలిచి.. శివాజీని ఎమోషనల్ చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో చూసిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఆ తరువాత తన కొడుకుని హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరికి పరిచయం చేశాడు.
అనంతరం కొడుకుతో కూర్చొని కొంతసేపు పర్సనల్ గా మాట్లాడాడు. ఇంకొన్ని రోజుల్లో శివాజీ కొడుకు పై చదువులు కోసం యూనివర్సిటీకి వెళ్లనున్నాడట. దీంతో తండ్రిని ఒకసారి కలిసి వెళ్లాలనే ఒక కొడుకు కోరికను నెరవేరుస్తూ బిగ్బాస్ ఈ అవకాశం కల్పించాడు. మరి ఆ సర్ప్రైజింగ్ ప్రోమోని మీరుకూడా చూసేయండి.
Next Story