Mon Dec 23 2024 11:15:48 GMT+0000 (Coordinated Universal Time)
కోహ్లీ బయోపిక్‌లో నటిస్తాను అంటున్న రామ్ పోతినేని..
విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాను అంటూ టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కామెంట్స్ చేశాడు. ఈ బయోపిక్ కోసం కొన్నాళ్లుగా రామ్ చరణ్ పేరు..
క్రికెట్లో 'కింగ్'గా పిలిపించుకునే 'విరాట్ కోహ్లీ' (Virat Kohli) బయోపిక్ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ బయోపిక్ పై ఎప్పుడు నుంచో చర్చ నడుస్తుంది. ఇక ఈ బయోపిక్ లో కోహ్లీ పాత్రని ఎవరు చేస్తారు అనేది దానిపై ప్రతి ఒక్కరిలో ఎంతో క్యూరియాసిటీ నెలకుంది. ఎందుకంటే ఈ బయోపిక్ కి కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ఎంత క్రేజ్ ఉంటుంది. దీంతో ఇండియన్ లాంగ్వేజ్స్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మరి అలాంటి గ్లోబల్ మూవీలో ఏ స్టార్ నటిస్తాడు అనేదాని ఆసక్తి ఉండడం కామన్. కాగా గత కొంత కాలంగా ఈ బయోపిక్ కోసం రామ్ చరణ్ (Ram Charan) పేరు వినిపిస్తుంది. కోహ్లీ అండ్ చరణ్ మధ్య దగ్గర పోలికలు ఉండడం, అలాగే బాడీ మెయిన్టైనెన్స్ కూడా ఇద్దరిది సేమ్ ఉండడంతో ఆడియన్స్ అండ్ మేకర్స్ కూడా రామ్ చరణ్ అయితే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ ని కూడా ఇటీవల ఒక నేషనల్ మీడియా ఈ విషయం గురించి ప్రశ్నించారు.
దానికి రామ్ చరణ్ బదులిస్తూ.. అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను అంటూ పేర్కొన్నాడు. ఇక తాజాగా మరో టాలీవుడ్ హీరో కూడా ఈ బయోపిక్ లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ఈ బయోపిక్ లో అవకాశం వస్తే చేస్తాను అంటూ కామెంట్స్ చేశాడు. రామ్ ప్రస్తుతం 'స్కంద' మూవీ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈక్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నాడు.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విరాట్ బయోపిక్ గురించి మాట్లాడుతూ.. తనకి, విరాట్ కి దగ్గర పోలికలు ఉంటాయని పలువురు తనతో కామెంట్స్ చేసినట్లు, ఒకవేళ ఆ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను అంటూ పేర్కొన్నాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ గ్లోబల్ బయోపిక్ లో నటించే అవకాశం ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
Next Story