సినిమాలకు అదే దిక్కా?
ప్రస్తుతం కరోనా కారణంగా కర్ఫ్యు నడుస్తుంది. కర్ఫ్యూ కారణంగా లాక్ డౌన్. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ బంద్ నడుస్తుంది. సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులు గుంపులుగా [more]
ప్రస్తుతం కరోనా కారణంగా కర్ఫ్యు నడుస్తుంది. కర్ఫ్యూ కారణంగా లాక్ డౌన్. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ బంద్ నడుస్తుంది. సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులు గుంపులుగా [more]
ప్రస్తుతం కరోనా కారణంగా కర్ఫ్యు నడుస్తుంది. కర్ఫ్యూ కారణంగా లాక్ డౌన్. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ బంద్ నడుస్తుంది. సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులు గుంపులుగా ఉంటారు కాబట్టి వైరస్ త్వరగా స్ప్రెడ్ అయ్యే ప్రమాదముంది గనక ముందే థియేటర్స్ మూసేసారు. వరసగా విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. రెండు వారలు కరోనా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే…. ఇది మరో నాలుగైదు వారలు అలానే ఉండేలా కనబడుతుంది వ్యవహారం. దానితో చిన్న చితక సినిమాలన్ని విడుదల వాయిదా వేసుకుని.. థియేటర్స్ ఓపెన్ కాగానే మరో డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోపు కొంతమంది చిన్న నిర్మాతలంతా ఓ డెసిషన్ కి వచ్చేలా కనబడుతుంది ప్రస్తుతం వ్యవహారం. రేపు థియేటర్స్ అన్ని ఓపెన్ అయినా విడుదల తేదీల విషయంలో గొడవలు పది.. సినిమాలన్ని ఒకదాని మీద ఒకటి వదిలేకన్నా ఓ పని చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఉన్నారట.
అదే ప్రస్తుతం తెగ డిమాండ్ ఉన్న ఓటిటి ప్లాట్ ఫామ్ ని ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. అంటే నిర్మాతలు ఏదో ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ కి తమ సినిమా హక్కులను అమ్మేస్తే.. డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ నుండే సినిమా ప్రేక్షకుల దగ్గరికి వచ్చేస్తుంది. క్క్ఆరోణ కారణంగా థియేటర్లు బంద్ నడుస్తుంది. దానితో ప్రేక్షకులు బయటికి వెళ్లలేక.. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ అయినా అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా, సన్ నెక్స్ట్ ల మీద ఆధారపడుతున్నారు. థియేటర్స్ బంద్ తో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిన కారణంగా చిన్న సినిమాలన్నీ ఓటిటి ద్వారా విడుదల చేస్తే బావుంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. అయితే నిర్మాతలు తాము పెట్టిన పెట్టుబడికి కొద్దిగా లాభానికి సినిమాని ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లోను ఏదో ఒకదానికి అమ్మేస్తే.. వారే ఆ సినిమాని డైరెక్ట్ గా తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ నుండి విడుదల చేస్తారు. ఇక గతంలో ఓటిటి వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు. కానీ ఫ్యూచర్ లో ఓటిటి ప్లాట్ ఫామ్ డిమాండ్ ఈ రేంజ్ లో పెరుగుతుంది అని ఎవరూ ఊహించని లేదు. మరి కరోనా కర్ఫ్యూ మరో నెల ఉంటే.. చివరికి ఓటిటి నే అందరికి గతి అయ్యేలా ఉంది.