Mon Dec 23 2024 11:43:06 GMT+0000 (Coordinated Universal Time)
Social Media : సినిమాల ప్రభావం జనాలు మీద కాదు.. వాళ్ళ ప్రభావమే..
ఒకప్పుడు సినిమాల్లో చెప్పిన పంచ్ డైలాగ్స్ ని ప్రేక్షకులు అనుసరించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడియన్స్ చెప్పిన..
Social Media : "సినిమాల ప్రభావం జనాలు మీద ఎంత ఉందో తెలియదు గాని, పంచ్ డైలాగ్ల ప్రభావం గట్టిగా ఉంది" అని 'ఆగడు'లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో చెప్పిన పంచ్ డైలాగ్స్ ని ప్రేక్షకులు అనుసరించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆడియన్స్ చెప్పిన పంచ్ డైలాగ్స్ ని సినిమాల్లో అనుసరిస్తున్నారు.
సోషల్ మీడియా యూసేజ్ పెరిగిన తరువాత.. ఏ విషయం ఎందుకు వైరల్ అవుతుందో తెలియడం లేదు. ఏ మాట ఎలా ట్రెండ్ అవుతుందో అర్దమకావడం లేదు. ఈక్రమంలో కొన్ని మాట్లాడకూడని బూతు పదాలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక జనాల్లో ఆ పదాలకు ఉన్న క్రేజ్ ని గమనించిన సినిమా మేకర్స్ తమ చిత్రాల్లో ఉపయోగించేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో KCPD, కుర్చీ మడతపెట్టి కొడితే.. ఇలా కొన్ని బూతు పదాలు బాగా వైరల్ గా మారాయి. ఇక ఈ పదాలను సినిమా వేదికల పైన, వెండితెర పై మాట్లాడుతూ ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈక్రమంలోనే మొన్న బాలయ్య సినిమాలో KCPD వాడడం, ఇప్పుడు మహేష్ బాబు మూవీలో కుర్చీ మడతపెట్టి డైలాగ్ ఉపయోగించడం యూత్ ని ఉత్సాహపరుస్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఆగ్రహం తెప్పిస్తుంది.
ఒక స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్స్.. ఇలాంటి బూతు పదాలను తమ సినిమాలు ద్వారా మరికొంతమందికి తెలియజేస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదాల మీనింగ్ ఏంటని పిల్లలు అడుగుతుంటే.. వారిని థియేటర్ కి తీసుకు వచ్చి సినిమా ఎలా చూపించగలం అంటూ ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు.. కుర్చీ మడతపెట్టి అని డైలాగ్ చెబుతూ డాన్స్ చేయడం పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ వ్యతిరేకత గమనించి.. మేకర్స్ ఈ పద్దతిని ముగిస్తారా లేదా అనేది చూడాలి.
Next Story