అభిజిత్ – అఖిల్ మధ్యలో సోహైల్!!
సీజన్ 4 బిగ్ బాస్ టైటిల్ రేసులో ఇప్పటివరకు కేవలం అఖిల్, అభిజిత్ లు పేర్లు మాత్రమే వినిపించాయి. అభిజిత్ క్లీన్ గా క్లాస్ గా టైటిల్ [more]
సీజన్ 4 బిగ్ బాస్ టైటిల్ రేసులో ఇప్పటివరకు కేవలం అఖిల్, అభిజిత్ లు పేర్లు మాత్రమే వినిపించాయి. అభిజిత్ క్లీన్ గా క్లాస్ గా టైటిల్ [more]
సీజన్ 4 బిగ్ బాస్ టైటిల్ రేసులో ఇప్పటివరకు కేవలం అఖిల్, అభిజిత్ లు పేర్లు మాత్రమే వినిపించాయి. అభిజిత్ క్లీన్ గా క్లాస్ గా టైటిల్ కొట్టడం ఖాయమంటే.. అఖిల్ రఫ్ గాను, మోనాల్ విషయంలో ప్రేమగా, అగ్రెసివ్ గా ఉంటూ టైటిల్ రేసులో ఉన్నాడని అన్నారు. అసలు అప్పుడే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని గూగుల్ లో కొడితే ఒకరి అభిజిత్ పేరు, మరోసారి అఖిల్ పేరు చూపించడంతో.. అఖిల్ లేదా అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్స్ అంటూ అందరూ ఫిక్స్ అవుతుంటే.. కొందరు మాత్రం అభిజిత్ విన్నర్ అంటూ ఫిక్స్ అవుతున్నారు. కేవలం మూడు వారాల గేమ్ ఉన్న హౌస్ లో ఈ వారం అరియనా, మోనాల్, అఖిల్ లలో ఒకరు వెళ్ళిపోతే ఇంకా హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉంటారు.
కానీ అఖిల్ – అభిజిత్ లు గొడవపడుతూ .. ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతూ గేమ్ ప్లే చెయ్యడం, అభిజిత్ ఓవర్ కాన్ఫిడెన్స్, అఖిల్ అతి యాక్షన్ అన్ని కలిపి ఇప్పుడు సోహైల్ కి అనుకూలంగా మారాయంటున్నారు. లాస్య కూడా వెళుతూ వెళుతూ సోహైల్ – అభిజిత్ లు టాప్ 2 లో ఉంటారని చెప్పినప్పటినుండి సోహైల్ ని బిగ్ బాస్ టైటిల్ రేసులోకి తీసుకొచ్చారు. మొదటి నుండి కాస్త కోపంతో అగ్రెస్సివ్ గా ఉండే సోహైల్ హౌస్ మేట్స్ అందరితో మంచి రిలేషన్ మెయింటింగ్ చేసే సోహైల్ నామినేషన్స్ లోకి కూడా చాలా తక్కువ సార్లు వచ్చాడు. ఇక ఫిజికల్ టాస్క్ లో సోహైల్ పెరఫార్మెన్స్ సూపర్. హౌస్‌లో జన్యూన్‌గా.. ట్రాన్స్ప్రెంట్గా తెలంగాణ వాళ్ళకి నచ్చేలా ఉన్న సోహైల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. సోహైల్ అభిమానులు ఇప్పుడు సోహైల్ పేరును ట్విట్టర్ లో ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు.
- Tags
- big boss 4
- Sohail