Mon Dec 23 2024 12:49:24 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయాల్లోకి వస్తున్నారా అన్న ప్రశ్నకు.. సోనూసూద్ సమాధానమిది
తాజాగా మళ్లీ సోనూ రాజకీయ ప్రవేశం విషయం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్క్ హోటల్లో నిర్వహించిన..
సోనూసూద్.. మూడేళ్లుగా దేశమంతా పరిచయం అక్కర్లేని పేరు ఇది. అంతకుముందు కేవలం సినిమా నటుడిగా కొందరికే తెలిసిన సోనూ.. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో అందరికీ సుపరిచితుడయ్యాడు. లాక్ డౌన్ లో కష్టాల్లో ఉన్నవారందరికీ కాదనకుండా తనవంతు చేయూతను అందించాడు. రీల్ హీరో నుంచి..రియల్ హీరోగా మారినపుడు సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చ జరిగింది. చాలామంది అభిమానులు రావాలని అడిగారు కూడా. మీడియా తారసపడినప్పుడల్లా ఈ ప్రశ్నే అడుగుతుండగా.. ఆయన ఆ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడుతూ వస్తున్నారు.
తాజాగా మళ్లీ సోనూ రాజకీయ ప్రవేశం విషయం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్క్ హోటల్లో నిర్వహించిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సోనూసూద్ మాట్లాడుతూ.. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. అసలు పాలిటిక్స్ లోకి వెళ్లాలన్న ఉద్దేశ్యమే తనకు లేదన్నారు. "నా జీవిత లక్ష్యం వేరు. ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమం. ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే నా లక్ష్యం" అని సోనూసూద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి చెప్పారు. అవసరానికి సహాయం చేసే వైద్యులు, దాతలు ఉండటం వల్లే తాను ఇంకా సేవలు చేయగలుగుతున్నానని సోనూసూద్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏడున్నర లక్షల మందికి సాయం చేశానన్న సోనూ.. వారిలో 95 శాతం మందిని తాను చూడలేదని వివరించారు.
Next Story