Mon Dec 23 2024 13:06:51 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్ల కోసం సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్
ఇతర దేశాలు, రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని తన సొంత ఖర్చులతో స్వగ్రామాలకు చేర్చడం నుండి.. పేదలకు తిండి..
సోనూసూద్.. కరోనా రాక ముందు వరకూ అతను కేవలం ఒక సినీ నటుడిగానే తెలుసు. రీల్ లో హీరో, విలన్ గా అలరించిన సోనూ.. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతోమందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఒక్కసారిగా దేశంలో అతనో సెన్సేషన్ గా మారాడు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని తన సొంత ఖర్చులతో స్వగ్రామాలకు చేర్చడం నుండి.. పేదలకు తిండి, ఇల్లు ఏర్పాటు చేయడం, దుస్తుల పంపిణీ, కనీస అవసరాలను తీర్చడం వరకూ సోనూసూద్ చేయని సహాయమంటూ లేదు. లాక్ డౌన్ తర్వాత కూడా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సోనూసూద్ ద్వారా లబ్ధిపొందిన వారెందరో ఉన్నారు. వారంతా సోనూసూద్ ను తమ పాలిట దేవుడిగా భావిస్తారు.
ఇటీవల బీహార్ కు చెందిన 27 ఏళ్ళ ఇంజనీర్ బీరేంద్రకుమార్ మహతో అనాథ పిల్లల కోసం సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ స్కూల్ లో 100 మందిదాకా పిల్లలు ఉన్నారు. దాతలు ఇచ్చే ఫండ్స్ ఆధారంగానే ఈ స్కూల్ రన్ అవుతుంది. ఈ విషయం సోనూసూద్ కి తెలియడంతో తాజాగా సోనూసూద్ బీహార్ కు వెళ్లి.. ఆ స్కూల్ ను సందర్శించారు. అనంతరం బీరేంద్రకుమార్ మహతో తో మాట్లాడి.. అక్కడ పిల్లలకు మరింత మెరుగైన వసతి, విద్యు, ఆహరం అందించడానికి, మరింతమంది అనాథపిల్లలను చేర్చుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందజేస్తానని, సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్ కి కొత్త బిల్డింగ్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. పిల్లల కోసం ఇకపై తాను కూడా బీరేంద్రకుమార్ తో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్ అక్కడి పిల్లలతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
Next Story