Fri Nov 22 2024 16:41:39 GMT+0000 (Coordinated Universal Time)
కోరమాండల్ ప్రమాదం : నష్టపరిహారాలపై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు
క్షతగాత్రులను పరామర్శించి, ప్రమాదానికి బాధ్యులెవరైనా ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం యావత్ దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 300 మందికి పైగా మరణించగా.. సుమారు 1000 మంది గాయపడ్డారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను పరామర్శించి, ప్రమాదానికి బాధ్యులెవరైనా ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి. ఈ పరిహారాలపై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలా ఒకేసారి డబ్బులు అందజేసి బాధితుల బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఖర్చులకు అయిపోయాక తర్వాత వారి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. ప్రమాదంలో చాలామందికి తీవ్రగాయాలయ్యాయి. కాలు, లేదా చేయి విరిగిన వారు.. తీవ్రంగా గాయపడి ఎప్పటికీ పనిచేయలేని వారి పరిస్థితి ఏమిటన్నారు. అందుకే బాధితులకు ఒకేసారి పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకోకుండా.. ప్రతి నెలా నిర్ణీత వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సోనూ ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వాలు నీలా ఆలోచిస్తే.. పేదవాడికి ప్రతిరోజూ కడుపు నిండుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story