Tue Nov 05 2024 10:48:31 GMT+0000 (Coordinated Universal Time)
అభిమానులకి సోనూసూద్ విన్నపం..
సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలకు ఎంతోమంది ఫిదా అయ్యారు. రీల్ విలన్ నుంచి.. రియల్ హీరోగా కొనియాడబడ్డారు.
సోనూసూద్ అంటే ఒకప్పుడు అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ గుర్తొచ్చేది. కానీ.. ఇప్పుడు సోనూసూద్ అనగానే గుర్తొచ్చేది మానవత్వం. కరోనా క్లిష్టపరిస్థితుల్లో అతను ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలందించారు. వలస కార్మికుల్ని సొంతూళ్లకు తరలించడం మొదలు.. విదేశాలలో చిక్కుకున్న వారిని సొంతూళ్లకు రప్పించడం, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఏర్పాటు చేయడం, ఆర్థిక సహాయం, పిల్లల్ని చదివించడం.. ఇలా ఎంతోమందికి అడగకుండానే సాయం చేసి అండగా నిలిచి.. మనిషి రూపంలో ఉన్న దేవుడయ్యాడు సోనూసూద్.
సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలకు ఎంతోమంది ఫిదా అయ్యారు. రీల్ విలన్ నుంచి.. రియల్ హీరోగా కొనియాడబడ్డారు. కరోనా పూర్తయ్యాక కూడా తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దీంతో చాలామంది సోనూసూద్ ని అభినందిస్తున్నారు. కొందరు తమకు చేసిన సహాయానికి తమకు తోచిన విధంగా ఋణం తీర్చుకుంటున్నారు. తమ షాపులకు సోనూసూద్ పేరు పెట్టుకుంటే.. కొందరు.. సోనూసూద్ దేవుడు అంటూ గుళ్లు కడుతున్నారు.
గతంలో సిద్ధిపేట దగ్గర ఉన్న ఓ తండాలో కూడా సోనూసూద్ గుడిని నిర్మించారు. తాజాగా సోనూసూద్ సిద్దిపేటకు విచ్చేసి ఈ గుడిని చూసి, ఇక్కడి ప్రజలతో, మీడియాతో మాట్లాడారు. సోనూసూద్ మాట్లాడుతూ.. నేను చేయగలిగినంత చేసే ఓ సామాన్యుడిని. ఇలా గుళ్ళు కట్టడం, పూజలు చేయటం లాంటివి చేయకూడదు అనుకుంటాను. కానీ నా మీద ప్రేమతో చేశారని నాకు తెలుసు. కానీ ఇకపై అలా చేయవద్దని నా అభిమానులకి సూచించారు. తనకు గుడికట్టే డబ్బుతో.. ఒక ఆస్పత్రి లేదా ఒక బడి నిర్మించాలని సోనూసూద్ కోరారు.
Next Story