Fri Dec 20 2024 12:36:10 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ డైరెక్టర్స్ సత్తా..
ఇక ఈ ఏడాది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద హీరోల డామినేషన్ కంటే దర్శకుల డామినేషన్ ఎక్కువ కనిపించింది. ఆ దర్శకులు ఎవరు..?
2023 Rewind : ఇక ఈ ఏడాది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద హీరోల డామినేషన్ కంటే దర్శకుల డామినేషన్ ఎక్కువ కనిపించింది. డైరెక్టర్స్ కి ఉన్న క్రేజ్ ఆ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రప్పించింది. మరి ఆ దర్శకులు ఎవరు..? ఆ సినిమా ఏంటో ఓ లుక్ వేసేయండి..
నెల్సన్ దిలీప్ కుమార్..
డాక్టర్, బీస్ట్ చిత్రాలతో యాక్షన్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో 'జైలర్' సినిమాని తెరకెక్కించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు చేశారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని రజినికి గ్రాండ్ కమ్‌బ్యాక్ చిత్రంగా నిలిచింది.
అట్లీ కుమార్..
తమిళ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ షారుఖ్ ఖాన్ తెరకెక్కించిన చిత్రం 'జవాన్'. విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటించారు. అట్లీ గత సినిమాలకు ఉన్న క్రేజ్‌తో.. ఈ చిత్రానికి సౌత్ లో ఓ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. తమిళం కంటే టాలీవుడ్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ వెళ్లాయి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1140 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని ప్రస్తుతానికి.. ఈ ఏడాది నెంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది.
లోకేష్ కనగరాజ్..
ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్.. అదే యూనివర్స్ లో విజయ్‌తో తెరకెక్కించిన చిత్రం 'లియో'. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఉన్న క్రేజ్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 620 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి విజయ్ కెరీర్ హైయెస్ట్ గా నిలిచింది.
సందీప్ రెడ్డి వంగ..
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టు బాలీవుడ్ మంచి ఫేమ్ ని సంపాదించుకున్న తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. బాలీవుడ్ హీరో రణబీర్ తో తెరకెక్కించిన చిత్రం 'యానిమల్'. బోల్డ్ అండ్ వైల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 860 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుంది. కాబట్టి ఈ కౌంట్ పెరగొచ్చు.
ప్రశాంత్ నీల్..
కేజీఎఫ్ చిత్రాలతో ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా చేరిన లోకేష్ కనగరాజ్.. ప్రభాస్ తో కలిసి చేసిన సినిమా 'సలార్'. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గత వారం రిలీజ్ అయ్యింది. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్ల పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ కలెక్షన్స్ స్పీడ్ చూస్తుంటే.. ఈ ఏడాది నెంబర్ వన్ గ్రాసర్ గా నిలిచిన 'జవాన్'కి టెన్షన్ పట్టుకొంది.
Next Story