Mon Dec 23 2024 09:30:27 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియుడితో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న నయన్ !
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన్ తన ప్రియుడితో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంది. డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార..
2021 కి వీడ్కోలు పలికి.. 2022 కి గ్రాండ్ గా స్వాగతం పలికారంతా. రెండ్రోజులుగా అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతున్నారు. పైగా వీకెండ్ కూడా కలిసి రావడంతో.. పలువురు సెలబ్రిటీ కపుల్స్ అండ్ ఫ్యామిలీస్ నూతన సంవత్సర వేడుకలను ఇతర దేశాల్లోనే జరుపుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే బాటలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన్ కూడా ఉన్నారు. తన ప్రియుడితో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంది.
డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార.. ఆయనతో కలిసి దుబాయ్ లో న్యూ ఇయర్ కు స్వాగతం పలికింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన తర్వాత ఈ ప్రేమ పక్షులు చెట్టా పట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను నయన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు.. ఇంకా ఎన్నిరోజులు ఇలా తిరుగుతారు త్వరగా పెళ్లిచేసుకోండంటూ కామెంట్స్ చేస్తున్నారు.
News Summary - South Lady Superstar Nayanatara Celebrated new year with her boyfriend vignesh shivan in dubai
Next Story