Mon Dec 23 2024 09:22:13 GMT+0000 (Coordinated Universal Time)
Empire Magazine : RRRకి మరో గుర్తింపు.. వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ లో జక్కన్న ఇంటర్వ్యూ
హాలీవుడ్ లో పలు ఫిలిం ఫెస్టివల్స్ లో RRR సినిమాని ప్రదర్శించారు. ఇటీవలే ఈ సినిమాకి హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్..
రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా RRR. ఈ సినిమా విడుదలై ఆరునెలలైనా.. ఇంకా హవా తగ్గలేదు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ RRR పేరు.. విదేశాలలో మారుమ్రోగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి RRR సినిమాను అభిమానిస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి RRRసినిమాకి గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే ఈ సినిమాను జాపనీస్ భాషలో జపాన్ లో విడుదల చేయగా.. అక్కడ కూడా విశేష స్పందన వచ్చింది.
హాలీవుడ్ లో పలు ఫిలిం ఫెస్టివల్స్ లో RRR సినిమాని ప్రదర్శించారు. ఇటీవలే ఈ సినిమాకి హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా వచ్చింది. తాజాగా RRR సినిమాకి మరో గుర్తింపు లభించింది. వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ అయిన ఎంపైర్ మ్యాగజైన్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసి వారి మ్యాగజైన్ లో RRR గురించి స్పెషల్ ఆర్టికల్ రాశారు. ఎంపైర్ మ్యాగజైన్ లో RRR సినిమా గురించి, రాజమౌళి డైరెక్షన్ గురించి చాలా గొప్పగా రాశారు. దీనిపై ఎంపైర్ మ్యాగజైన్ రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
Next Story