Mon Dec 23 2024 12:01:47 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి "పుష్ప" లో ఆ సీన్ కట్.. ఇంతకీ ఎందుకు ?
ఓ రొమాంటిక్ సీన్ లో బన్నీ తన వ్యాన్ లో కూర్చొని శ్రీవల్లి భుజంపై చేయివేసి ఫోన్ మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత పుష్ప శ్రీవల్లి
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప - ది రైజ్. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో సుక్కు స్పెషల్ మార్క్ ఉందని, అలాగే బన్నీలో ఉన్న అసలైన హీరోయిజాన్ని సుకుమార్ బయటపెట్టాడని అంటున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయంట. ఇక రొమాన్స్ విషయానికొస్తే.. అల్లు అర్జున్ - రష్మిక ల మధ్య బాగానే లవ్ ట్రాక్ నడిచిందట. రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. పుష్ప లో ఒక రొమాంటిక్ సీన్ మాత్రం మరీ అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. దీంతో నేటి నుంచి పుష్ప సినిమాలో ఆ సీన్ ను కట్ చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇబ్బంది
పుష్పరాజ్ - శ్రీవల్లిల మధ్య సెకండాఫ్ లో జరిగిన ఓ రొమాంటిక్ సీన్ లో బన్నీ తన వ్యాన్ లో కూర్చొని శ్రీవల్లి భుజంపై చేయివేసి ఫోన్ మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత పుష్ప శ్రీవల్లి శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ పై చేయి వేసినట్లుగా చూపిస్తారు. ఈ సీన్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు ఈ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేయగా.. మేటర్ కాస్తా సుకుమార్ చెవినపడింది. అందుకే సినిమాలోని ఆ రొమాంటిక్ సీన్ ను తొలగించేందుకు ఫిక్స్ అయ్యాడట మన క్రియేటివ్ డైరెక్టర్. అందుకే నేటి నుంచి ప్రదర్శించే పుష్ప షో లలో ఆ సీన్ ను కట్ చేసి మిగతా సినిమా వేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
News Summary - Spicy Romantic Scene Deleted From Pushpa - The Rise Movie
Next Story