ఈ దెబ్బతో శ్రద్ద పై రూమర్స్ పోయినట్టేనా?
శ్రద్ధా కపూర్ - ఫర్హాన్ అక్తర్ ఇద్దరు లవ్ లో ఉన్నారని గత కొన్ని నెలలు నుండి వార్తల్లోనూ వస్తున్నాయి. బాలీవుడ్ మొత్తం హాట్ టాపిక్ అయిన ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. శ్రద్ధా - ఫర్హాన్ ఇద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది ఆ మధ్య. లేటెస్ట్ గా ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్టు అయింది.
రీసెంట్ గా....
రీసెంట్ గా ఫర్హాన్ అక్తర్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో మీడియాకి దొరికాడు. వానీ దండేకర్ అనే వీజే, టీవీ హోస్టుతో గత కొన్ని నెలలు నుండి ప్రేమాయణాన్ని నడిపిస్తున్నాడు. కొన్ని రోజులు కిందట శివానీ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఫర్హాన్ అక్తర్ తో దిగిన ఫొటోను పోస్టు చేసి వీరి ప్రేమ గురించి చెప్పకనే చెప్పింది. అలానే వీరిద్దరూ బయట తిరుగుతూ మీడియా కంట పడ్డారు.
మొత్తానికి చివరకు...
రీసెంట్ గా ఫర్హాన్ అక్తర్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో సెట్ కావడంతో.. శ్రద్ధా కపూర్ పై రూమర్లు ఆగిపోయినట్టే. దాంతో బాలీవుడ్ మీడియా ఫోకస్ మొత్తం వీరిపై పడింది. సో శ్రద్ధా కపూర్ - ఫర్హాన్ అక్తర్ పై ఉన్న రూమర్లన్నింటికీ ఇక ఫుల్ స్టాప్ పడినట్టే. శ్రద్ధా తండ్రి ఈ విషయం గురించి చాలా సార్లు ఆమెను హెచ్చరించినట్టు తెలుస్తుంది. అయినా శ్రద్దా లెక్క చేయకుండా ఫర్హాన్ తో తిరిగిందని అప్పుడు బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. ఏది అయితేనేం మొత్తాన్ని శ్రద్దా పై రూమర్స్ పోయినట్టే.