రకుల్ పై శ్రీరెడ్డి కామెంట్స్..!
ప్రస్తుతం ఇండియా మొత్తం #మీటూ ఉద్యమం నడుస్తుంది. చాలామంది సినీ తారలు #మీటూ ఉద్యమంపై సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. రోజుకి ఒక్కరు ఈ లిస్ట్ లో చేరుతున్నారు. తాజాగా ఈ ఉద్యమంలో మరో టాలీవుడ్ నటి ఎంటర్ అయింది. కొన్ని నెలలు నుండి నటి శ్రీరెడ్డి ఇటువంటి లైంగిక వేదింపుల ఆరోపణలను కొంతమంది టాలీవుడ్ ప్రముఖులపై చేస్తోంది. అసలు తెలుగు పరిశ్రమలో ఇటువంటివి ఏమీ జరగలేదని, అటువంటి అనుభవం ఎప్పుడు తనకు ఎదురుకాలేదు అంటూ రకుల్ వ్యాఖ్యలు చేయడంతో శ్రీరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాంతో వీరిద్దరి మధ్య మాటల యుద్దం మొదలైంది.
గళమెత్తడం హర్షనీయం
అంతకుముందు కూడా ఒక్కసారి రకుల్ చేసిన కామెంట్స్ కి శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు మరోసారి తనపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. ఇది ఎప్పటినుండో జరుగుతున్న తంతే. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇలాంటి ఉద్యమం ఒకటి రావడం హర్షనీయమని కొంతమంది మహిళ సంఘాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఉద్యమం ఎక్కడికి వరకు వెళ్తుందో చూడాలి.