శ్రీవిష్ణుని తీసుకోవడం వెనుక ఇంత కథ ఉందా..?
మెగా హీరో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. కెరీర్ లో పట్టుమని పది సినిమాలు కూడా చేయకముందే.. ఇలా విలన్ రోల్ [more]
మెగా హీరో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. కెరీర్ లో పట్టుమని పది సినిమాలు కూడా చేయకముందే.. ఇలా విలన్ రోల్ [more]
మెగా హీరో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. కెరీర్ లో పట్టుమని పది సినిమాలు కూడా చేయకముందే.. ఇలా విలన్ రోల్ లో వరుణ్ తేజ్ నటించడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాలూ సోషల్ మీడియాలో ఇప్పటికే వినబడుతున్నాయి. కారణం హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఒక తమిళ రీమేక్ లో నటించడమే. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన జిగర్తాండ సినిమాను తెలుగులో హారిష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు. ఇక జిగర్తాండ తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. బాబీ సింహ పాత్రలో హారిష్ కాస్త అటు ఇటు మార్పులు చేసి మెగా హీరో వరుణ్ తేజ్ ని ఒప్పించాడు.
సిద్ధార్థ్ స్థానంలో శ్రీవిష్ణు
తాజాగా ఆ సినిమా వాల్మీకి టైటిల్ తో మొదలైంది కూడా. ప్రస్తుతం వాల్మీకి టైటిల్ మీద చిన్నపాటి రచ్చ కూడా జరిగింది. వాల్మీకి అనే టైటిల్ లో గన్ ఉందని.. తమ కులస్థులను అవమాన పరుస్తున్నారంటూ.. వాల్మీకులు గొడవ చేశారు. ఇక ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి వరుణ్ తేజ్ ని ఎంపిక చెయ్యగా.. హీరో సిద్దార్ధ్ పాత్రకి మరో హీరో కావాల్సి వస్తుంది. అందుకే ఆ పాత్రకి హరీష్ తాజాగా హీరో శ్రీ విష్ణుని ఎంపిక చేసినట్టుగా ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. నారా రోహిత్ ఫ్రెండ్ గా, సోలో హీరోగా తనకి తాను నిరూపించుకున్న శ్రీ విష్ణుకి హీరోగా మంచి పేరైతే వచ్చింది కానీ… హీరో స్టేటస్ పూర్తిగా రాలేదు.
వరుణ్ ను హైలైట్ చేయడానికే…
అయితే ఆ సినిమాలో కాస్త పేరున్న హీరో అయితే.. వరుణ్ తేజ్ కి హైప్ రాదు కనుకనే.. ఇలా చిన్న హీరో అయిన శ్రీవిష్ణుని హరీష్ ఎంపిక చేసాడంటున్నారు. వరుణ్ తేజ్ పాత్ర హైలెట్ చేస్తూ.. వరుణ్ కోసమే సినిమా అన్నట్టుగా ఈ వాల్మీకి సినిమా ఉండబోతుందట. అందుకే ఇలా శ్రీవిష్ణుని హీరో పాత్రకి తీసుకున్నారు. ఇక ఈ తమిళ జిగర్తాండలో హీరో సిద్ధూ కన్నా ఎక్కువగా విలన్ పాత్రధారి బాబీ సింహాకే మంచి పేరొచ్చిన విషయం తెలిసిందే.