Mon Dec 23 2024 11:00:41 GMT+0000 (Coordinated Universal Time)
లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు.. 'భళాతందనాన'టీజర్
ఈ టీజర్ లో ఉన్న ప్రతి డైలాగ్.. దేనికదే హైలెట్ గా నిలిచాయి. "రాక్షసుడిని చంపేందుకు దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి.. నేను
శ్రీవిష్ణు హీరోగా.. కేథరీని ట్రెసా హీరోయిన్ గా చైతన్య దంతులూరి దర్శకత్వంలో రానున్న సినిమా భళాతందనాన. శ్రీవిష్ణు చాలా సెలక్టివ్ సినిమాలు చేస్తుంటాడు. అతను చేసే సినిమాల్లో ఏదో కొత్తదనం కనిపిస్తుంటుంది. శ్రీవిష్ణు చేసే ప్రతి సినిమా నుంచి ఖచ్చితంగా మంచి మెసేజ్ మాత్రం ఉంటుంది. తాజాగా శ్రీవిష్ణు నటించిన భళాతందనాన టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో ఉన్న ప్రతి డైలాగ్.. దేనికదే హైలెట్ గా నిలిచాయి. "రాక్షసుడిని చంపేందుకు దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి.. నేను మామూలు మనిషిని" అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది.
Also Read : ప్రముఖ సాహితీవేత్త ఎండ్లూరి సుధాకర్ మృతి
"నిజాయతీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే. లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు " అనే డైలాగ్ లు టీజర్ చూసిన ప్రతిఒక్కరినీ తాకేలా ఉన్నాయి. ఆఖరిలో.. సీఎం కుర్చీలో కూర్చున్న ఎవ్వరైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ నే మార్చేయొచ్చు. అంటే.. ఆ పవర్ చేతిదా? కుర్చీదా?'' అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ టీజర్ కే హైలైట్. సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మణిశర్మ మ్యూజిక్ అందించారు. చాలాకాలం తర్వాత కేథరీన్ హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో కేథరిన్ శశిరేఖగా కనిపించనుంది. ఫిబ్రవరిలో భళాతందనాన ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
News Summary - Sri Vishnu's Bhala Tandanana Movie Teaser Out Now
Next Story