ఈ స్టార్ డాటర్స్ ఏం సాధించారు
బాలీవుడ్ లో ఈ ఏడాది ఇద్దరి స్టార్స్ కూతుళ్లు వెండి తెర ఎంట్రీ ఇచ్చారు. వారిలో అందాల తార లేట్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఒకరు, మరొకరు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. అయితే జాన్వీ కపూర్ ఇషాన్ ఖట్టర్ తో కలిసి ధఢక్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఈసినిమాలో జాన్వీ కపూర్ లుక్స్ అవి బావున్నాయి కానీ.. సినిమా సో సో గానే ఉంది. ఇక శ్రీదేవి అభిమానుల వలన ధఢక్ నిర్మాతలకు లాస్ రాకుండా ఒడ్డున్న పడ్డారు కానీ.. లేదంటే ధఢక్ దెబ్బ మాములుగా పడేది కాదు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ కి మంచి పేరొచ్చింది.
కేదరనాథ్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ మొదటి సినిమా కేదారనాథ్ తో ప్లాప్ అందుకుంది. కేదారనాథ్ ప్లాప్ అయితే ఏమిటి ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అలీ ఖాన్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మరి సారా నటనను కూడా మెచ్చుకున్నారు. ఇక కేదారనాధ్ ప్లాప్ అయినా... సారా మరో చిత్రంతో త్వరలోనే రాబోతుంది. సారా నటించిన రెండో సినిమా సింబా కూడా విడుదలకు సిద్దమవుతుంది. కేదారనాధ్ సినిమా షూటింగ్ లో ఉండగానే.. సారా అలీఖాన్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి సింబా సెట్స్ మీదకెళ్ళిపోయింది.
ఇక తాజాగా సింబా సినిమా త్వరలోనే అంటే.. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేదారనాధ్ సినిమా గత శుక్రవారమే విడుదలై బాక్సాఫీసు వద్ద కుస్తీలు పడుతుంది. ఇక స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సింబా తో అన్నా హిట్ వస్తుంది అని ఆశపడుతోంది. ఇక ఈ ఏడాది గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ కూతుళ్లు ఇద్దరూ ప్లాప్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తమ ఆశలన్నీ తమ తదుపరి ప్రాజెక్టుల మీదే పెట్టుకున్నారు. జాన్వీ కపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతుంటే.... సారా అలీ ఖాన్ మాత్రం తెలుగు రీమేక్ సింబా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.