Mon Dec 23 2024 12:20:08 GMT+0000 (Coordinated Universal Time)
వేలానికి దివంగత నటి శ్రీదేవి చీరలు.. ఆ డబ్బుతో ?
పదహారేళ్ల వయసు సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించి..
అలనాటి అందాల నటి శ్రీదేవిని ఎవరూ మరిచిపోలేరు. మరిచిపోయే అందమా అది. పదహారేళ్ల వయసు సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించి.. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానుల మనసు గెలుచుకున్న శ్రీదేవి.. ఇంగ్లిష్ వింగ్లిష్ లో చీరకట్టును ఓసారి గుర్తు చేసుకోండి. 1997లో నటనకు విరామం చెప్పి.. తిరిగి 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ తోనే శ్రీదేవి అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది.
ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్నినిర్వహించేందుకు డైరెక్టర్ గౌరీ షిండే ప్లాన్ చేస్తున్నారట. ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా పదేళ్ల వేడుకను నిర్వహించడంతో పాటు.. ఆ సినిమాలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని అనుకుంటున్నట్లు గౌరీ షిండే ప్రకటించారు. ఆ మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు. ఈ విషయాలను దర్శకురాలు గౌరీ షిండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు.
Next Story