హేమ దాచింది… శ్రీముఖిది బయటికొచ్చింది
తెలుగులో గత వారం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను మెల్లగా తమవైపు తిప్పుకుంటుంది. ఈ బిగ్ బాస్ 3… 15 [more]
తెలుగులో గత వారం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను మెల్లగా తమవైపు తిప్పుకుంటుంది. ఈ బిగ్ బాస్ 3… 15 [more]
తెలుగులో గత వారం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను మెల్లగా తమవైపు తిప్పుకుంటుంది. ఈ బిగ్ బాస్ 3… 15 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమై గత ఆదివారం ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడమే కాదు…. ఆమె ప్లేస్ లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఇచ్చేసింది. మొదటి 15 మంది నుండి నటి హేమ ఎలిమినేట్ అవగా… ట్రాంజెండర్ తమన్నా హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ షోలో మెయిన్ హైలెట్ గా నిలుస్తున్నది ఎవరంటే… ప్రముఖ యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్, డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ లాంటి వాళ్ళు. శ్రీముఖి యాంకరింగ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. అయితే బిగ్ బాస్ యాజమాన్యం శ్రీముఖిని కావాలనే తీసుకొచ్చినట్లుగా టాక్. ప్రతి నిత్యం తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరగా.. ప్రస్తుతం క్రేజ్ ఉన్న శ్రీముఖిని స్టార్ మా యాజమాన్యం ఒప్పించి ఈ షోకి తీసుకొచ్చినట్లుగా మొదటినుండి టాక్.
ఇక షో లో శ్రీముఖి హైలెట్ అవడానికి ప్రయత్నిస్తుంది కూడా. షర్ట్స్ వేసుకుని స్పైసీ గా డాన్స్ చెయ్యడమే కాదు.. మంచి మంచి సారీస్, మంచి డ్రెసులతో స్పెషల్ ఫోకస్ అవుతుంది. ఇక గత ఆదివారం నాగార్జున శ్రీముఖిని ఉధ్యేశించి ఓ వార్ణింగ్ లాంటి మాట చెప్పాడు కూడా. శ్రీముఖి నువ్వు అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పొద్దని. ఇక కొన్ని విషయాల్లో శ్రీముఖి హౌస్ మేట్స్ అందరికీ యాంటీగానే మారింది. దానికి నిదర్శనం లేటెస్ట్ ఎలిమినేషన్స్ ప్రక్రియ. ఆ ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఆమెకి హైయ్యెస్ట్ ఓట్స్ హౌస్ మెంబెర్స్ నుండి వచ్చాయి. ఇక యాంకర్ గా కెరీర్ లో మంచి ఊపులో ఉన్న శ్రీముఖి ని బిగ్ బాస్ కి తీసుకొస్తే బిగ్ క్రేజ్ వస్తుందని భావించిన స్టార్ మా ఆమెకి భారీ పారితోషకం ఆఫర్ చేసిందట. ఆమె పాపులారిటీ దృష్ట్యా ఏకంగా 3.5 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే టాప్ హీరోయిన్స్ కూడా టాలీవుడ్ నిర్మాతల నుండి ఆ రేంజ్ పారితోషకం అందుకోవడం లేదు. ఇక తాజాగా బిగ్ బాస్ నుండి బయాటికొచ్చిన హేమకి నిన్నజరిగిన ప్రెస్ మీట్ లో భారీ పారితోషకమై ఓ ప్రశ్న ఎదురుకాగా.. ఆమె చాలా తెలివిగా ఆ ప్రశ్నకు సమాధానం దాటేసింది.