Mon Dec 23 2024 15:33:58 GMT+0000 (Coordinated Universal Time)
ప్లాప్ డైరెక్టర్తో గోపీచంద్ మూవీ.. వర్క్ అవుట్ అయ్యేనా..?
గత కొంత కాలంగా ప్లాప్ల్లో ఉన్న శ్రీను వైట్ల.. గోపీచంద్ మూవీతో అయినా హిట్ కొడతాడా..?
టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ని అనుభవించిన శ్రీను వైట్ల.. ప్రస్తుతం ఒక హిట్ కొట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. యాక్షన్ చిత్రాలకు తన మార్క్ కామెడీని యాడ్ చేసి.. థియేటర్ లో టికెట్ కొన్న ప్రతి ప్రేక్షకుడికి సంతృప్తి కలిగేలా చేసేవాడు శ్రీను వైట్ల. ఈయన తీసిన పలు సినిమాలు ఇప్పటికి చాలామంది ఆడియన్స్ ఫేవరెట్ లిస్ట్ లో ఉంటాయి. మహేష్ బాబుతో దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన శ్రీను వైట్ల.. అదే మహేష్ తో ఆగడు తీసి డిజాస్టర్ అందుకున్నాడు.
ఇక అక్కడి నుంచి మొదలయింది ప్లాప్ల పరంపర. దీంతో శ్రీను వైట్లతో సినిమా చేసేందుకు హీరో, నిర్మాతలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ మధ్య తన సూపర్ హిట్ మూవీ 'ఢీ'కి సీక్వెల్ ప్రకటించనప్పటికీ.. అది కూడా పట్టాలు ఎక్కలేదు. 2018 నుంచి ఒక సినిమా కూడా ప్రకటించని శ్రీను వైట్ల.. ఇప్పుడు సడన్ గా మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) తో ఒక అనౌన్స్ చేయడమే కాదు, పూజా కార్యక్రమాలతో లాంచ్ కూడా చేసేశాడు.
కొత్త నిర్మాణ సంస్థ చిత్రాలయం స్టూడియోస్ తమ మొదటి ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ని కూడా మొదలు పెట్టనున్నారు. అయితే గత కొంత కాలంగా ప్లాప్ల్లో ఉన్న శ్రీను వైట్ల.. గోపీచంద్ మూవీతో అయినా హిట్ కొడతాడా..? తన మార్క్ టేకింగ్ తో మళ్ళీ ఆడియన్స్ ని అలరిస్తాడా..? అని అందరిలో ఆసక్తి నెలకుంది. మరి ఈ ప్రాజెక్ట్ శ్రీను వైట్లకు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
కాగా గోపీచంద్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్షతో 'భీమ' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ఏడాది రామబాణం చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చినా అది ప్లాప్ గా నిలిచింది. దీంతో భీమ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
Next Story