ఆ దర్శకుడు హోటల్ కి రమ్మన్నాడు
టాలీవుడ్ ని వదిలి కోలీవుడ్ లో చీకటి కోణాలపై, పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు గుప్పిస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా దర్శకుడు సుందర్ సీ ని టార్గెట్ చేసింది. ‘తమిళ్ లీక్స్’ పేరుతో ఏఆర్ మురుగదాస్, రాఘవ లారెన్స్ పై ఇప్పటికే విమర్శలు చేసిన ఆమె సుందర్ సీపై ఫేస్ బుక్ లో ఆరోపణలు చేశారు. అరుణాచలం, విన్నర్ వంటి సినిమాలతో సుందర్ సి మంచి గుర్తింపు పొందాడు.
అందరిపై ఫిర్యాదు చేస్తా...
అయితే, ‘అరన్మనయ్’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న సమయంలో ఆ చిత్రం ఎగ్జిగ్యూటీవ్ ప్రొడ్యూసర్ గణేష్ నాకు ఫోన్ చేసి షూటింగ్ స్పాట్ కి పిలిపించి సుందర్ సికి పరిచయం చేశాడు. వారి తర్వాతి సినిమాలో 200 శాతం అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. తర్వాతి రోజు ఫోన్ చేసి నోవోటెల్ కి రావాలని, సినిమాలో అవకాశం కావాలంటే కాంప్రమైజ్ కావాలి చెప్పారు. గణేష్ ఒక మోసగాడు. నాకు ఏమాత్రం సహాయం చేయలేదు.’ అంటూ శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అంతేకాదు వీరందరిపై ఫిర్యాదు చేయడానికి చెన్నై వెళుతున్నట్లు స్పష్టం చేసింది.