Sun Dec 22 2024 19:13:41 GMT+0000 (Coordinated Universal Time)
SSMB28 Title Glimpse : మహేష్ మాస్ స్ట్రైక్ తో దద్దరిల్లిన థియేటర్లు
తాజాగా నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ అయిన థియేటర్లలో..
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా SSMB28. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన వరుస అప్డేట్స్.. ప్రిన్స్ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ లోనూ టైటిల్ పై క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ అయిన థియేటర్లలో SSMB28 టైటిల్ గ్లింప్స్ ని ప్రదర్శించారు. సాయంత్రం 6.03 గంటలకు గ్లింప్స్ ప్రదర్శించడంతో.. థియేటర్లన్నీ అభిమానుల అరుపులు, కేకలతో దద్దరిల్లాయి.
ఈ గ్లింప్స్ లో మహేష్.. “ఏంది అట్ట చూస్తున్నావ్. బీడీ 3d లో కనబడుతోందా” అన్న డైలాగ్ హైలెట్ గా నిలిచింది. గ్లింప్స్ లో మహేష్ బాబు మాస్ చూసిన ఆడియన్స్.. మహేష్ మాస్ స్ట్రైక్ అదిరిపోయింది అంటున్నారు. మహేష్ నోటిలో నుంచి బీడీ తీసి కలుస్తుంటే ఊరమాస్ లా ఉంది. సినిమాకు ముందుగా ఊహించినట్టే గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
Next Story