Mon Dec 23 2024 08:13:17 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
అలీ కుమార్తెకు కూడా ఇటీవలే వివాహమైంది. రెండ్రోజుల క్రితమే రామ్ చరణ్ - ఉపాసన తల్లిదండ్రులు ..
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలంతా వరుసగా తల్లిదండ్రులవుతున్నారు. కొందరు కొత్తగా వివాహ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే హన్సిక, ప్రముఖ దర్శకుడి కుమార్తె నీలిమ పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే అలీ కుమార్తెకు కూడా ఇటీవలే వివాహమైంది. రెండ్రోజుల క్రితమే రామ్ చరణ్ - ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని అనౌన్స్ చేశారు చిరంజీవి. పెళ్లైన పదేళ్లకు ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో.. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు తమిళ్ దర్శకుడు అట్లీ కుమార్. అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్.
ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసి, రాజారాణి సినిమాతో దర్శకుడిగా మారాడు. 2014 నవంబర్ 9న నటి కృష్ణ ప్రియను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కృష్ణ ప్రియ పలు సినిమాల్లో హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్స్ చేసింది. తాజాగా ఈ ఇద్దరు తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. దాంతో ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ విల్లువెత్తుతున్నాయి. రాజారాణి తర్వాత అట్లీ తేరి, మెర్సెల్, బిగిల్ లాంటి సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేస్తున్నాడు.
Next Story