Fri Jan 10 2025 14:03:33 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడ గుండులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?
సాధారణంగా ఆ స్టార్ డైరెక్టర్ ఎప్పుడూ గుబురు గడ్డంతో, జులపాలతో కనిపిస్తూ ఉంటాడు
సాధారణంగా ఆ స్టార్ డైరెక్టర్ ఎప్పుడూ గుబురు గడ్డంతో, జులపాలతో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా గుండులోనూ.. క్లీన్ షేవ్ లోనూ కనిపిస్తే అందరూ ఒక్క సారిగా షాక్ అవుతారు. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసా? డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అనిమల్ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అలాంటి వ్యక్తి బుధవారం కొత్త లుక్‌లో కనిపించారు. తిరుమల ఆలయంలో గుండుతో కనిపించారు.
సందీప్ రెడ్డి వంగా తిరుమలలో సందడి చేశాడు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించాడు. తలనీలాలు సమర్పించాడు సందీప్. అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు తీసిన వ్యక్తి ఇంత కూల్ గా కనిపించడం నిజంగా షాకింగ్ గా అనిపిస్తూ ఉంది. సందీప్ తిరుమల ఆలయ ఆవరణలో కనిపించారు. చాలా మంది ఆయన్ను గుర్తు పట్టలేకపోయారు. పింక్ స్కార్ఫ్‌తో ముదురు నీలం రంగు కుర్తాను ధరించాడు. 2017లో అర్జున్ రెడ్డి నుండి ఎప్పుడూ ఒత్తైన జుట్టుతో.. గుబురు గడ్డంతో కనిపిస్తూ వచ్చాడు. ఇక సందీప్ సినిమాల్లో కథానాయకులందరూ ఒకే విధమైన అవతారంలో కనిపిస్తారు. ఇక త్వరలో సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత అనిమల్ పార్క్ సినిమా ఉండనుంది.
Next Story